Lakhanpal becomes Canadas prime minister for a day

Lakhanpal becomes canadas prime minister for a day

Prabjote Lakhanpal, Canada, Prime Minister, One Day PM, Canada PM

19-year-old Indian origin cancer survivor Prabjote Lakhanpal had his wish granted when he got to become the prime minister of Canada for a day. Brampton lad Prabjote could sit in the PM's chair for a day because of 'Make-A-Wish-Canada', a foundation that helps children with life threatening conditions.

ఒక రోజు ప్రధానిగా పంజాబ్ యువకుడు

Posted: 03/02/2016 09:35 AM IST
Lakhanpal becomes canadas prime minister for a day

ఒకే ఒక్కడు సినిమాలో ఒక రోజు సిఎం కాన్సెప్ట్ చూసే ఉంటారు. సాధాసీదాగా ఉన్న అర్జున్ అనుకోకుండా ఒక్క రోజు సిఎం అవుతారు. తాజాగా పంజాబ్‌ యువకుడికి ఓరోజు కెనడా ప్రధానిగా వ్యవహరించేందుకు అవకాశమొ చ్చింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రాంప్టన్‌ పట్టణానికి చెందిన ప్రభుజోత్‌ లఖన్‌పాల్‌ అనే యువకుడికి మేక్‌ ఏ విష్‌ కెనడా అనే సంస్థ ఈ అవకాశం కల్పించింది. కెనడా రాజధాని ఒట్టావాకు తన కుటుంబంతోపాటు వెళ్లిన లఖన్‌పాల్‌కు ఓరోజుపాటు ప్రధానికుండే సదుపాయా లు కల్పించారు. ప్రధాని వెంట ఉండే ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా ఆయన వెంట అనుసరింపజేశారు.

కెనడా సిఎం హోదాలో లఖన్‌పాల్‌ ఎక్కడికెళితే అక్కడ పూర్తి గౌరవ మర్యాదలిచ్చారు. కెనడా ప్రధాని ప్రయాణించే చాలెంజర్‌ జెట్‌ విమా నంలో ప్రయాణించే అవకాశం కూడా లఖన్‌పాల్‌కు కల్పించారు. ప్రధానిగా ఒట్టా వాలోని పార్లమెంట్‌ హిల్‌ను సందర్శించడం ఎంతో అద్భుతంగా ఉందనీ, ఇటు వంటిది కలలో కూడా తాను ఊహించలేదని లఖన్‌పాల్‌ వ్యాఖ్యానించారు. కెనడా ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడీవ్‌ లా పలు ఫోటోలకు లఖన్‌పాల్‌ ఫోజులిచ్చారు. మొత్తానికి మంచి ఉద్దేశంతో లఖన్ పాల్ ను ప్రధానిని చెయ్యడం వార్తల్లో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabjote Lakhanpal  Canada  Prime Minister  One Day PM  Canada PM  

Other Articles