railway ministry and tourism department provide e catering service

Railway to provide e catering service ffor ffood

Indian railways, railway ministry, E-catering, tourism department, quality food, passengers, quality food to railway passengers

Indian railway and tourism irctc department to provide quality food to its passengers, including pizza, burger and what not through e-catering service

రైలు ప్రయాణికులకు ఇక నాణ్యమైన రుచికర అహారం..

Posted: 03/01/2016 07:12 PM IST
Railway to provide e catering service ffor ffood

ఇక రైలు జర్నీ చేసే ప్రయాణికులకు  భోజనం, అల్పాహారం సమస్యలు తీరనున్నాయి. కేంద్ర ప్రవేశపెట్టనున్న ఈ-కేటిరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను కల్పించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.  ఇండియన్ రైల్వే, టూరిజంశాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే విధంగా రుచికరమైన ఫుడ్ ను అందించనున్నాయి. క్యాంటిన్స్ లేని రైళ్లో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే మంత్రిత్వశాఖ ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.

కేఎఫ్సీ, డోమినాస్, బిట్టూ, టిక్కి వాలా, ఫుడ్ పాండా మొదలగు రకాల ఆహార ఉత్పత్తులను ప్రయాణికులు పొందే అవకాశాన్ని కల్పించారు. సెంట్రలైజ్డ్ క్యాటరింగ్ సర్వీస్ మానిటరింగ్ సెల్ (సీఎస్ఎంసీ) టోల్ ఫ్రీ నెంబర్ 1800111321 లో వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కేటరింగ్ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాడక్ట్స్ నాణ్యత లేని పక్షంలో, సర్వీసులలో ఏమైనా తలెత్తినా  నెంబర్ 138కు కాల్ చేసి ప్రయాణీకులు తమ ఫిర్యాదులు తెలియచేసే అవకాశాన్ని కల్పించారు. ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సింహా ఈ వివరాలను గతవారం పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles