Union Budget disappoints Ap state

Union budget disappoints ap state

AP, Budget, Budget 2016, SPecial Package, Polavaram, Vishakapatnam, Metro Rail

Union Budget disappoints Ap state Union Finance Minister Arun Jaitly did not allot funds to ap.

ఏపికి ప్యాకేజీ కాదు కదా.. నిధులు కూడా తక్కువే

Posted: 02/29/2016 03:09 PM IST
Union budget disappoints ap state

కేంద్ర బడ్జెట్‌‌‌‌పై కొండంత ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు..ప్రభుత్వానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మొండిచేయి చూపారు. పడుతూ లేస్తూ నడుస్తున్న రాష్ట్రానికి అరుణ్‌ ఏమైనా దారి చూపుతారా అంటూ ప్రజలు ఆశపడ్డారు. కాని అవేం లేకుండా జైట్లీ ప్రసంగం సాగింది. గతేడాది లాగే ప్రత్యేకహోదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో పాటు స్పెషల్ ప్యాకేజీ ప్రస్తావన లేదు. దీంతో సగటు ఆంధ్రుడు నిరాశలో కూరుకుపోయాడు.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు ఇవే:
* పోలవరం ప్రాజెక్ట్‌-100 కోట్లు
* విజయవాడ మెట్రో-100 కోట్లు
* విశాఖ మెట్రో- లక్ష రూపాయలు
* ట్రిపుల్‌ ఐటీలకు రూ.20కోట్లు
* తిరుపతి ఐఐటీకి రూ.40కోట్లు
* విశాఖ ఐఐఎంకు రూ.30కోట్లు
* తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీకి రూ.40కోట్లు
* తిరుపతి ఐఐఎస్‌సీఆర్‌కు రూ.40 కోట్లు
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి
మొత్తం మీద రాష్ట్ర విభజనతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌ కూడా నిరాశనే మిగిల్చింది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్‌కు జైట్లీ 100 కోట్లు కేటాయించారు. అదే సమయంలో విజయవాడ‌లో ఏర్పాటు చేస్తున్న మెట్రో రైల్వేకి కూడా 100 కోట్లు కేటాయించి సరికొత్త వివాదానికి తెర లేపారు. ఏపీ విభజన బిల్లులోని ప్రతి హామీని అమలు చేస్తామని..పోలవరం నిర్మాణానికి ప్రధాని చేయూత అందిస్తామన్నారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు 4 వేల కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాని కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు..లక్షల మందికి తాగునీరందించే పోలవరం ప్రాజెక్ట్‌‌తో విజయవాడ మెట్రోని పోల్చడం సరికాదంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Budget  Budget 2016  SPecial Package  Polavaram  Vishakapatnam  Metro Rail  

Other Articles