Delhi CM Arvind Kejriwal says his car attacked in Punjab's Ludhiana

Arvind kejriwal s car attacked in poll bound punjab

Delhi chief minister Arvind Kejriwal, Kejriwal car attacked in Ludhiana, Punjab polls, Badals, Arvind Kejriwal,Delhi,Punjab,Aam Aadmi Party,AAP,Akali Dal,Ashish Khetan

Arvind Kejriwal tweeted today that his car had been attacked with sticks and stones in Punjab's Ludhiana, where he is campaigning for his Aam Aadmi Party

లుధియానాలో అరవింద్ కేజ్రీవాల్ కారుపై భీకరదాడి..

Posted: 02/29/2016 02:11 PM IST
Arvind kejriwal s car attacked in poll bound punjab

రాజకీయీలలో పసికందే అయినా కసిగా రాణిస్తూ.. ప్రజాప్రయోజిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంటున్న అమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. రౌడీ మూకల రాజ్యాలుగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లు అపఖ్యాని మూటగట్టుకుంటుండగా, తాజాగా అదే స్థాయిలో పంజాబ్ లోనూ అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. పంజాబ్ లోని లుధియానాలో పర్యటిస్తున్న ఆయనపై ఇవాళ ఉదయం అల్లరి మూకలు భీకర దాడి జరిగింది. కర్రలు, రాళ్లు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు కేజ్రీ కారుపై విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద రాళ్లు పడటంతో కేజ్రీ కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అయితే కేజ్రీ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డారు. ఈ దాడిపై స్వయంగా కేజ్రీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

‘‘లూధియానాలో నా కారుపై కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. కారు ముందు గ్లాస్ పేన్ పగిలిపోయింది. నా పర్యనటపై బాదల్ కుటుంబం తీవ్ర అసంతృప్తితో వుంది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా నా పర్యటనపై అసహనంతో ఉంది. ఎన్ని దాడులు చేసిన నా ఆశయాన్ని మాత్రం భగ్నం చేయలేవు’’ అని కేజ్రీ ట్వీటారు. ఇక ఆప్ నేత ఆశిష్ ఖేతన్ కూడా వెనువెంటనే స్పందించారు. ‘‘కేజ్రీవాల్ ను తీవ్రంగా గాయపరిచేందుకు దుండగులు అతి సమీపంలోకి వచ్చారు. అయితే దేవుడి దయ వల్ల కేజ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు’’అని ఖేతన్ పేర్కొన్నారు. పంజాబ్ పర్యటనలో ఉన్న కేజ్రీకి ముప్పు ఉందంటూ ఢిల్లీ పోలీసులు.. నాలుగు రోజుల క్రితమే పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేసినా అక్కడి పోలీసులు రూట్ మ్యాప్ లేకుండా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుండా వ్యవహరించడంపై విమర్శలు వినబడుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Delhi  Punjab  Aam Aadmi Party  AAP  Akali Dal  Ashish Khetan  

Other Articles