Fapcci appriciated The Union Budget

Fapcci appriciated the union budget

Budget, Manmohan Singh, Budget 2016, Union Budget

Fapcci appriciated The Union Budget. But Ex PM Manmohan Singh said that The Union Budget is avarage.

బడ్జెట్ బాగుందన్న ఫ్యాప్సీ.. అంతంతమాత్రం అన్న మన్మోహన్

Posted: 02/29/2016 04:05 PM IST
Fapcci appriciated the union budget

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఫ్యాప్సీ స్పందించింది. ఈమేరకు ఇవాళ ఫ్యాప్సీ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి మాట్లాడారు. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. గ్రామీణ యువత ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆశించిన మేరకు కేటాయింపులు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టిపెట్టారని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగం లేని అంతంతమాత్రపు బడ్జెట్ ను అరుణ్ జైట్లీ తీసుకువచ్చారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని పేర్కొనడం అసాధ్యమైన ఆలోచనగా సింగ్ అభివర్ణించారు. ఇది సంభవం కాని కల వంటిదని, ఒకవేళ సాధించగలమని భావిస్తే, దానికి మార్గాలను చెప్పుండేవారని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లూ సాలీనా 14 శాతం వృద్ధి నమోదైతేనే రెట్టింపు ఆదాయం సంభవమని, కేవలం 2 నుంచి 3 శాతం వృద్ధికే పరిమితమైన వ్యవసాయ వృద్ధిని, జీడీపీని మించిన స్థాయికి ఎలా తీసుకెళ్లగలరో చెప్పాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే, గత సంవత్సరం చెప్పిన ద్రవ్యోలోటు లక్ష్యాలకే జైట్లీ కట్టుబడి వాస్తవ పరిస్థితి క్లిష్టంగా ఉందని అంగీకరిస్తున్న సంకేతాలు పంపారని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత గురించి ఆలోచిస్తున్న పాలకులు, ఆ దిశను వీడి ఆదాయ భద్రత గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Budget  Manmohan Singh  Budget 2016  Union Budget  

Other Articles