Donald Trump again blames India for taking away American jobs

In rip off rant trump says indians taking americans jobs

2016 US presidential elections, China, Donald Trump, India, Super Tuesday, US presidential elections 2016, indians taking away jobs, republican presidential candidate,

With Trump Mania picking up in the US ahead of Super Tuesday, Donald Trump, the controversial Republican presidential frontrunner, again blamed India for taking away jobs from Americans

మళ్లీ భారతీయులపై విషం కక్కిన డోనాల్డ్ ట్రంప్..

Posted: 02/29/2016 02:05 PM IST
In rip off rant trump says indians taking americans jobs

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై విషం చిమ్మారు. గత వారం ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొని తనను అగ్రరాజ్య అధ్యక్షుడిగా గెలిపిస్తే.. భారతీయులందరినీ వెనక్కు పంపిస్తానని చెప్పిన ట్రంప్.. తాజాగా అదే ప్రచారాస్త్రంతో ముందుకువెళ్తున్నాడు. నెవేడా కాకస్ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉన్న ట్రంప్, భారత్ పై, భారతీయులపై తన విమర్శలనే తన అస్త్రాలుగా చేసుకుని ప్రచారంలో మరింత ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన నాలుగు ప్రైమరీ ఎన్నికల్లో మూడింటిని ట్రంప్ కైవసం చేసకున్న విషయం తెలిసిందే. సౌత్ కరోలినా, న్యూ హాంప్‌షైర్, నెవేడాలలో ట్రంప్ ముందంజలో ఉండగా.. అయోవా కాకస్‌లో మాత్రం ట్రంప్‌ను రెండో స్థానంలోకి నెట్టి క్రుజ్ గెలిచారు.  69 ఏళ్ల ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజం గతేడాదే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. కొలంబియాలోని స్థానిక ఎయిర్ పోర్టులో ప్రసంగించారు. అమెరికాను మరోసారి గ్రేట్ అనిపించేలా చేస్తామని వ్యాఖ్యానించారు. భారత్, చైనా, జపాన్ లాంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని.. తాను గెలిస్తే అమెరికాలోని ఆ ఉద్యోగులను తొలగిస్తానని లాస్‌వెగాస్ ర్యాలీలో చెప్పిన విషయాన్ని ఇక్కడ పునరుద్ఘాటించారు.

రోజురోజుకు అతని విజయావకాశాలు మెరుగు పరుచుకుంటూ సాగుతున్నాడు. కొలంబియాలో ఉపన్యాస వేదిక ప్రాంగణంలో అయితే  'అమెరికా.. అమెరికా', 'ట్రంప్.. ట్రంప్' అనే నినాదాలతో మార్మోగిపోయింది. తర్వాత ఎన్నికలు జరగనున్న టెక్సాస్ లోనూ విజయం తనదేనని ట్రంప్ ధీమాగా ఉన్నారు . అమెరికా సరిహద్దు ప్రాంతం మెక్సికో చుట్టూ రక్షణ గోడను ఏర్పాటు చేసి వలసలకు అడ్డుకట్ట వేస్తామని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లిన వారు, ట్రంప్ హామీలతో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఉన్నాడని ఆందోళన చెందుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : america  president elections  Donald Trump  Indians Jobs  

Other Articles