hyderabad special operations team police burst rave party

Rave parties again in hyderabad accused in police custody

rave party, hyderabad sot police, narsingi farm house, police raid rave party, narsingi rave party, police burst ravve party, rave party acccused in police custody, narsingi police, semi nude dancers, rave party accused,

rave party sounds again in hyderabad, narsingi, with a tip of information hyderabad special operations team police arrest accused and semi nude dancers of rave party

మళ్లీ లోల్లి పెడుతున్న ఆ పార్టీలు.. పోలీసుల అదుపులో నిందితులు..

Posted: 02/29/2016 01:58 PM IST
Rave parties again in hyderabad accused in police custody

రెండేళ్ల క్రితం వరకు భాగ్యనగరం సహా శివారు ప్రాంతాలలో అలజడి సృష్టించడంతో పాటు పోలీసులకే ఎదురుతిరిగిన ఆ పార్టీలో మళ్లీ లొల్లి పెట్టడం ప్రారంభించాయి.  పోలీసుల కఠిన వైఖరి నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా  వీటి సంఖ్య తగ్గినా, మళ్లీ చిన్నగా ఈ పాశ్చాత్య సంస్కృతి జడలు విప్పుతోంది. హైదరాబాద్ కేంద్రంగా మళ్లీ ఆ రేవ్ పార్టీలు సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు రేవ్ పార్టీలో మునిగి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.

తాజాగా వయసు మీద పడ్డ కొంతమంది నడి వయస్కులకు రేవ్ పార్టీపై మోజు పుట్టింది. అదేదో సినిమాలో చూపినట్టు.. జీవితంలో వయస్సంతా సంపాదనకు, చక్కని హోదా కలిగిన ఉద్యోగానికి ఖర్చు కాగా, ఆ వయస్సులో తీరని ముచ్చటలు ఇప్పుడు తీర్చుకునేందుకు పోటీ పడ్డారు. అమ్మాయిలతో అర్థనగ్నంగా అసభ్యకర డ్యాన్సులు చేయించి మరీ ఎంజాయ్ చేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు మెరుపు దాడి చేసి అంకుల్స్ సహా డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నగర శివారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఐదుగురు అమ్మాయిలు, 10 మంది దాకా అంకుల్స్, ముగ్గురు నిర్వాహకులు ఉన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rave party  hyderabad sot police  narsingi farm house  crime news  

Other Articles