Union Budget 2016-17

Union budget 2016 17

Union Budget, Budget, Arun Jaitly, Modi, Tax

Finance Minister Arun Jaitley will present his third General Budget on Monday. There are enough indications to suggest that the Union Budget for 2016-17 will primarily focus on stimulating growth without deviating too much from the fiscal deficit target set by Mr. Jaitley in his previous Budget.

మరికొద్దిసేపట్లో బడ్జెట్.. సర్వత్రా ఆసక్తి

Posted: 02/29/2016 08:48 AM IST
Union budget 2016 17

దేశప్రజల ఆశలు, మరెన్నో ఆకాంక్షల మధ్య ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మరికొద్ది సేపట్లో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టబోతున్నారు. స్టాక్‌ మార్కెట్‌ పతనంతో ఆందోళనలో ఉన్న పెట్టుబడిదారుల్ని, రైతాంగాన్ని తృప్తి పరిచేలా ఎలాంటి ప్రతిపాదనలను ఆర్థికమంత్రి చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆదాయపు పన్ను విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న స్లాబులనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించేలా జైట్లీ ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. పన్ను మినహాయింపుల వరకు స్వల్పంగా మార్పులుచేసే అవకాశముంది.

వరసగా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో గ్రామీణ ప్రాంతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో సామాజిక పథకాలపై ఎక్కువ మొత్తాలను కేటాయించాల్సిన ఒత్తిడి ఆర్థిక మంత్రిపై ఉంది. అదే సమయంలో సత్వరం సంస్కరణలు అమలు కావాలని కోరుకుంటున్న విదేశీ పెట్టుబడిదారుల మనసుల్నీ ఆయన నెగ్గాల్సి ఉంది. వీరు గత ఏడాది కాలంలో 2.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,080 కోట్లు) విలువైన షేర్లను విక్రయించేశారు. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతభత్యాలు చెల్లించడానికి అవసరమయ్యే రూ.1.02 లక్షల కోట్లు కారణంగా ఆర్థిక మంత్రి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. వ్యవసాయ రంగ సంక్షోభం, పంటలకు తగిన ధరలు లభించకపోవడం వంటి పరిస్థితుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇప్పటి మాదిరిగానే నిధులు కేటాయించవచ్చు. పంటల బీమా పథకానికి, సేద్యపు నీటి పనులకు నిధుల్ని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్లలో కార్పొరేట్‌పన్నును 30% నుంచి 25 శాతానికి తగ్గిస్తామని జైట్లీ గత ఏడాది హామీ ఇచ్చారు. ఆ కసరత్తును ఈ బడ్జెట్‌ నుంచే ప్రారంభించవచ్చు. పరోక్ష పన్నుల్ని పెంచడమో, కొత్త పన్నుల్ని విధించడమో తప్పేలా లేదు. గత ఏడాది 14.5 శాతానికి పెంచిన సేవాపన్నును ఈసారి మరికొంత పెంచే వీలుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Budget  Budget  Arun Jaitly  Modi  Tax  

Other Articles