Gang Rape in Karimnagar

Gang rape in karimnagar

Gang Rape, Rape, Karimnagar, Veenavanka

Two men gangraped a woman in Karimnagar. they also recorded Rape in a phone.

ITEMVIDEOS: కరీంనగర్ లో గ్యాంగ్ రేప్

Posted: 02/29/2016 08:17 AM IST
Gang rape in karimnagar

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని రేప్ చేసి, దాన్ని వీడియో తీశారు. కాగా రేప్ చేసిన వారి తల్లిదండ్రులు తమ పిల్లలు పాపాత్ములని వారికి ఎలాంటి శిక్ష వేసినా,చివరికి వారిని చంపేసినా తప్పులేదని స్పష్టం చేశారు. ఇలాంటి పిల్లలు ఎవరికీ పుట్టకూడదని, ఆడపిల్లలను ఎవరూ వేధించకూడదని వారు అభిప్రాయపడ్డారు. మా పిల్లలకు వేసే శిక్షను చూసి ఆడవారిని ఎవరూ హింసించకూడదని వారు అన్నారు. కరీంనగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అతి దారుణమైనది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో స్థానిక పోలీసులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. మండలంలోని చల్లూరుకు చెందిన ఓ దళిత యువతితోపాటు శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్ (23), కల్వల గ్రామానికి చెందిన ముద్దం రాకేశ్(19), ముద్దం అంజయ్య(20) అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. అతను మాయమాటలు చెప్పి యువతిని ఈనెల 10న మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ నుంచి శంకరపట్నం మండలం కాచాపూర్ గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. రాకేశ్, అంజయ్యలకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకున్నాడు. ఆ గుట్ట వద్ద రెండేళ్ల కింద నడిచిన క్వారీకి సంబంధించిన ఓ రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

'అన్నా.. నన్ను వదిలిపెట్టండి.. మీ కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా..’.. అని ప్రాధేయపడినా కనికరించలేదు. తర్వాత అంజయ్య, రాకేశ్ కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం యువతిని వీణవంక బస్టాండ్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మరుసటి రోజు నుంచి యువతి కోచింగ్‌కు వెళ్లడం లేదు. అయినా ఆ ముగ్గురు కీచకులు... మళ్లీ తమ కామవాంఛ తీర్చాలంటూ యువతిని వేధించడం ప్రారంభించారు. లేకుంటే వీడియోలను ఇంటర్‌నెట్‌లో బెదిరించారు. దీంతో జరిగిన ఘటనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఈ నెల 24న రాత్రి 10 గంటల సమయంలో యువతితో ఆ యువకులకు ఫోన్ చేయించి, చల్లూరుకు పిలిపించారు. వారినుంచి సెల్‌ఫోన్ తీసుకొని చూడగా... లైంగికదాడి దృశ్యాలు కనిపించడంతో ఆగ్రహంతో చితకబాది, పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన యువకులను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang Rape  Rape  Karimnagar  Veenavanka  

Other Articles