Priyanka Chopras Best Dressed at the Oscars 2016

Priyanka chopras best dressed at the oscars 2016

Priyanka Chopra, Oscars, Oscars 2016

On Hollywood's biggest night, the celebs showed us exactly what star status looks like. Let's just say there were bold colors, sparkle and ball gowns a plenty. While a pretty dress gets you noticed, confidence is the difference between leading the style pack and getting lost in a sea of sequins.

ఆస్కార్ వేదిక మీద మెరిసిన ప్రియాంక

Posted: 02/29/2016 09:01 AM IST
Priyanka chopras best dressed at the oscars 2016

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ భామలు ధగధగలాడారు. ఫ్యాషన్ గౌనులతో కిక్కెక్కించారు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఆస్కార్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. క్వాంటికో సీరియల్‌తో అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక ఈ ఏడాది ఆస్కార్స్‌లో అవార్డును కూడా ప్రజెంట్ చేయనుంది. వైట్ క్రీమ్ గౌన్‌లో వచ్చిన బాలీవుడ్ బ్యూటీ రెడ్‌కార్పెట్ అతిథులను తన అందాలతో స్టన్ చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 88వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం కోసం తారలంతా తరలివచ్చారు

88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటిగా అలీషియా వికందర్‌(ద డానిష్‌ గర్ల్‌) ఆస్కార్‌ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో స్పాట్‌లైట్‌ చిత్రం అకాడమీ అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జెన్నీ బెవన్‌(మ్యాడ్‌ మాక్స్‌: ఫ్యూరీ రోడ్‌), ఉత్తమ ప్రొడక్షన్‌గా కొలిన్‌ బిగ్సన్‌(మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీరోడ్‌) ఉత్తమ మేకప్‌, కేశాలంకరణ విభాగంలో లెస్లే వాండర్‌వాల్ట్‌, ఎల్కా వార్డెగా(మ్యాడ్‌మ్యాక్‌: ఫ్యూరీ రోడ్‌), ఉత్తమ ఛాయాగ్రహణం కేటగిరీలో ఎమ్మాన్యుయెల్‌ లుబెజ్కి(ది రెవెనెంట్‌), ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ విభాగంలో మార్గరెడ్‌ సిజెల్‌( మ్యాడ్‌ మ్యాక్‌: ప్యూరీ రోడ్‌)లకు అవార్డులు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Oscars  Oscars 2016  

Other Articles