Roja have only option to play record Dance

Roja have only option to play record dance

Roja, Record Dance, YSRCP, Anam VivekanandaReddy, Anam

Anam Vivekananda Reddy slams YSRCP Leader Roja. He said that Roja have only option to play record dance

రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే గతి

Posted: 02/29/2016 08:15 AM IST
Roja have only option to play record dance

ఆనం వివేకానంద రెడ్డి మాట తీరు ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఆయన ఎవరిని టార్గెట్ గా చేసి మాట్లాడినా వారికి చుక్కలు కనిపించాల్సిందే. అయితే తాజాగా ఆయన వైసీపీ నాయకురాల మీద చేపిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే రోజా మీద ఆనం విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రోజా వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆనం రోజాపై తీవ్రంగా మండిపడ్డారు.

వైసిపి అధినేత జగన్ కార్యక్రమాల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే గతి అని ఘాటుగా మాట్లాడారు. రోజాకు జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. రోజా టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అంతకుముందు రోజా టిడిపిలో ఉందని, అప్పుడు టిడిపి అధికారంలోకి రాలేదన్నారు. జగన్‌ను 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 33 ఏళ్ల తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేకపోయాయని చెప్పారు. కానీ రోజా ఎక్కడ పాదం మోపితే అక్కడ ఆ పార్టీ సర్వనాశనం ఖాయమని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Record Dance  YSRCP  Anam VivekanandaReddy  Anam  

Other Articles