Subramanian Swamy's car pelted with eggs and tomatoes in Kanpur

Subramanian swamy s car egged shown black flags in kanpur

Subramanian Swamy, eggs, tomatoes, seminar, global terrorism, VSSD college, Kanpur, BJP leader, National Herald Case, Ayodhya issue, Ram Temple, protest, ink attack, BJP leader Subramanian Swamy, JNU statement, Congress district President Harprakash Agnihotri attacks Subramanian Swamy

BJP leader Subramanian Swamy's car was pelted with eggs and tomatoes on Saturday in Kanpur city where he had arrived to attend a seminar on global terrorism in VSSD college.

ITEMVIDEOS: సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురు.. నల్లజెండాలు, కోడిగుడ్లు, టామాటాతో స్వాగతం

Posted: 02/27/2016 03:52 PM IST
Subramanian swamy s car egged shown black flags in kanpur

అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా.. ఆ పార్టీ నేతలను కోర్టు మెట్లు ఎక్కించిన నేత ఆయన. నిన్నటి వరకు జనతా పార్టీలో వున్నా ఆయన గత కొంత కాలం కిందట బీజేపిలో చేరారు. ఇక అధికారం అండతో అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఇటు రాహుల్ గాంధీని కూడా వేధించసాగారు. రాహుల్ గాంధీకి దేశ పౌరసత్వం లేదని వాదనలు తెరమీదకు తీసుకోచ్చింది కూడా ఆయనే, అంతేకాదు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లను న్యాయస్థానం మెట్లు ఎక్కించిన నేత కూడా ఆయనే. ఇంతకీ ఆయనెవరో తెలుసా ఆయనే సుబ్రహ్మణ్య స్వామి.

అయితే ఆయనకు కాన్పూర్ లో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక నవాబ్ గంజ్ లోని వీఎస్ఎస్డీ కళాశాలలో గ్లోబల్ టెర్రరిజంపై ఏర్పాటుచేసిన సెమినార్కు హాజరవుతున్న సుబ్రహ్మణ్యం స్వామికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపి, కారుపై కోడిగుడ్లు, టమోటాలు విసిరి అవమానించారు. నల్ల ఇంకు చల్లారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. వీరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు,  కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర  తోపులాట జరిగింది.  దీంతో  ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పై లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : congress activists  kanpur  protests  subramanian swamy  

Other Articles