14 year old dalit girl gangraped set on fire in uttar pradesh

Minor dailt girl gangraped burnt in up

Minor Dailt girl, minor girl gangraped, minor girl burnt in Uttar pradesh, UP Dalit girl, Sivan town, Ghazipur district, Uttar Pradesh, attrocities on women, harrassment on women, rape on women, gangrape on women

A 14-year-old Dalit girl, who left to Sivan town from her village in Ghazipur district in Uttar Pradesh

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిప్పు పెట్టిన దుండగులు

Posted: 02/27/2016 03:34 PM IST
Minor dailt girl gangraped burnt in up

ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను కామాంధులు సామూహిక అత్యాచారం చేసి.. అంతటితో ఆగకుండా తమ నేరం బయటపడకూడదని బాధితురాలికి నిప్పు పెట్టారు. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలికను సామూహిక అత్యాచారం చేసి, నిప్పు పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడి.. సృహ కోల్పోయిన బాధితురాలిని స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.

7వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి స్వగ్రామం నుంచి దగ్గరలోని శివన్ పట్టణానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఊరు దాటిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై కిరోసిన్ పోసి అంటించి పరారయ్యారు. బాధితురాలు సాయం చేయాల్సిందిగా కేకలు వేస్తూ చెరుకుతోటలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mior dalit girl  gang rape  ghazipur  uttar pradesh  crime news  

Other Articles