Telangana govt regularizes contract staff

Telangana govt regularizes contract staff

Telangana, KCR, contract staff, Regulisation, Regulaizers

Telangana Government finally taken a decision to regularizing contract employees in the state. The services of those contract employees working from June 2, 2014 will be regularized the government reportedly said in an order issued on Friday. The orders issued implying the regularization of Andhra Pradesh Public Employment Act of 1994.

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త

Posted: 02/27/2016 09:50 AM IST
Telangana govt regularizes contract staff

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1994 చట్టంలోని నియామకాలు, క్రమబద్ధీకరణ నిబంధనలను, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, జీతభత్యాల విధానాలను తెలంగాణ ప్రభుత్వానికి అనువర్తింపచేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాలను, జీవో నం.212, 1994 నిబంధనలను, తెలంగాణ ప్రభుత్వానికి అన్వయించుకుంటూ అవసరమైన నిబంధనలను సవరిస్తామని, చట్టసభల ఆమోదం తీసుకుంటామని తెలియచేస్తూ ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో దీనిని ప్రచురించనున్నారు.

జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నవారితోపాటు అంతకు ముందు కూడా ఉద్యోగంలో ఉన్నవారు, అప్పటికే 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారికి వర్తించేవిధంగా అవసరమయితే నిబంధనలను మార్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున, క్యాబినెట్ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం చట్టాలను, నిబంధనలను తీసుకువస్తారు. అవసరమయితే చట్టసభల ఆమోదం కూడా తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  KCR  contract staff  Regulisation  Regulaizers  

Other Articles