825 crore for Krishna Pushkaralu

825 crore for krishna pushkaralu

Krishna Pushkaralu, telangana, Indrakaran Reddy

Nearly Rs 825.16 crore would be spent on providing amenities at sites being developed for Krishna Pushkaralu in Nalgonda, Mahbubnagar and Khammam. Telangana Endowment and Housing Minister A Indrakaran Reddy said on Friday that Rs 212.99 crore has been earmarked for construction of bathing ghats, Rs 398.03 crore for road works under R and B Department, Rs 133.83 crore for road works under Panchayat Raj, Rs 38 crore for Rural Water Supply, Rs 1.19 crore for Fisheries, Rs 8.60 crore for Energy, Rs 1.91 crore for public health, Rs 10 crore for Home department and Rs one crore for Fire department.

కృష్ణా పుష్కరాలకు 825 కోట్లు

Posted: 02/27/2016 09:49 AM IST
825 crore for krishna pushkaralu

ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు  825 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ దేవాదాయా శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. మార్చి 15వ తేదీ నుంచి పుష్కరాల పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్దిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ఓ వేళ ఎక్కువ మంది లబ్దిదారులు ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.

గత కృష్ణా పుష్కరాల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలో 17 ఘాట్లు ఏర్పాటు చేశారని ఈసారి అదనంగా మరో 35 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో 11 ఘాట్లు ఉండగా మరో 23 ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి కోసం 212కోట్లు కేటాయించామని తెలిపారు. ఘాట్లను చేరుకునే ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణానికి, మరమత్తులకు 398కోట్లు కేటాయించామని, వీటిలో 299కోట్లు నల్లగొండ జిల్లాలో, రూ.99కోట్లు మహబూబ్‌నగర్‌లో ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Pushkaralu  telangana  Indrakaran Reddy  

Other Articles