Manmohan Singhs weakness of keeping mum has now hit PM Modi

Manmohan singhs weakness of keeping mum has now hit pm modi

Modi, Manmohan SIngh, TMC, Silence syndrome, Sultan Ahmed

Trinamool Congress (TMC) on Friday took a dig at Prime Minister Narendra Modi by saying that he was suffering from the “silence syndrome” that had hit his predecessor Manmohan Singh. The TMS also said that Modi was facing the problem of “two power centres”, one of them being in Nagpur.

నాడు మన్మోహన్ కు.. నేడు మోదీకి అదే వ్యాధి

Posted: 02/27/2016 09:55 AM IST
Manmohan singhs weakness of keeping mum has now hit pm modi

ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ విరుచుకుపడింది. దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నా కానీ మోదీ మాత్రం కిమ్మనకుండా ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుల్తాన్ అహ్మద్  మండిపడ్డారు.  ప్రధాని నరేంద్రమోదీకి మౌన వ్యాధి ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాధి గత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూ ఉండేదని ఎద్దేవా చేశారు. మన్మోహన్ అధికార కేంద్రం సమస్యను ఎదుర్కొన్నట్లే.. మోదీ కూడా నాగ్‌పూర్ అధికార కేంద్రం సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయవాదం అంటే అందరినీ కలుపుకొనిపోవడమని చెప్పారని.. మోదీ కూడా మైనారిటీలు, దళితులను కలుపుకొనిపోవాలని సూచించారు. ఈ విషయంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

దేశ ప్రజలు ఎన్నో ఆశలతో ప్రధాని మోదీకి అధికారం అప్పగిస్తే.. ప్రభుత్వం రెండేండ్లుగా పాలన కుంటుపడిందని సుల్తాన్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన్మోహన్ పాలనను విమర్శించిన బీజేపీ అధికారంలో వచ్చాక అదే తరహా పాలనను కొనసాగిస్తున్నదని ఎద్దేవా చేశారు. జాట్ ఆందోళన గతంలో పాటిదార్ ఉద్యమం వల్ల దేశం తగులబడినా ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాట్ ఆందోళన వల్ల 34వేల కోట్ల నష్టం జరిగినా స్పందించకపోవడమేనా..? 56 అంగుళాల ఛాతీ అని విమర్శించారు. నీరసం వల్ల మన్మోహన్‌ సింగ్ మాట్లాడలేకపోయి ఉండవచ్చు.. కానీ, మోదీ మాత్రం విదేశీ ప్రయాణాలతో తీరిక లేకుండా ఉండటంవల్లే దేశంలోని సమస్యలపై మాట్లాడటంలేదని చురకలంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Manmohan SIngh  TMC  Silence syndrome  Sultan Ahmed  

Other Articles