Hottest day recorded in Kashmir in 76 years

Hottest day in kashmir in 76 years

Kashmir, hottest day, Climate Change, environmentalists, Global Warming, Srinagar, change in climate condition, Kashmir, Meteorological Department, temperature, 76 years record, Temperature, 20.6 degrees celsius

Kashmir witnessed the hottest day in February in 76 years as the mercury rose to 20.6 degrees Celsius in Srinagar, more than 10 degrees above normal for this time of the year.

వణుకు పుట్టే చోట.. వేడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది..

Posted: 02/25/2016 10:26 AM IST
Hottest day in kashmir in 76 years

అది అత్యంత శీతల ప్రాంతం. దేశంలోనే ఎక్కడా నమోదు కాని ఉష్ణోగ్రతలు అక్కడ నమోదు అవుతుంటాయి. శీతకాలంలో అక్కడి వుంటే వెన్నులో వణుకు పుడుతుంది. హిమపాతం కురుస్తున్న సన్నివేశాలను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి అహ్లాదాన్ని పోందుతుంటారు. అలాగే వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి సేద తీరుతుంటారు. అదే భారతమాత సిగలో పుష్పంగా బాసిల్లుతున్న కాశ్మీరం. కాశ్మీరం అందాలు ఏప్పుడు చూసిన మనోరంజకం.

అయితే అలాంటి కశ్మీర్‌లో వేసవి ప్రారంభానికి ముందే వేడి రగిల్చింది. ముఖ్యంగా కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నమోదైన ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను విస్తుపర్చాయి. ఏకంగా 76 ఏళ్ల కిందట నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదైంది. 1940, ఫిబ్రవరిలో 20.6 డిగ్రీల సెల్సీయస్ నమోదైంది. ఇదే ఉష్ణోగ్రత మంగళవారం నమోదు కావడం విశేషం. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు అధికమని ప్రాంతీయ వాతావరణ విభాగం డెరైక్టర్ సోనం లోటస్ తెలిపారు. 76 ఏళ్లలో ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir  hottest day  Climate Change  Global Warming  Srinagar  

Other Articles