Bihar CM Nitesh Kumar had barrow five rupees

Bihar cm nitesh kumar had barrow five rupees

Bihar, Nitesh Kumar, Barrow, Patna

Nitish Kumar, Chief Minister of Bihar, steps out of home and office without any money in his pocket. And, when the need arises, he waits for someone to bail him out.At least that is what happened on Wednesday. After flagging off a fleet of City Buses in Patna, Mr Kumar stepped into a bus to see the interiors. He took a seat in the moving bus and the woman conductor promptly handed him a ticket and asked for Rs. 5 - the fare for his journey from Gandhi Maidan to Patna station.

ఆ సిఎం జేబులో ఐదు రూపాయలు కూడా లేవు

Posted: 02/25/2016 11:45 AM IST
Bihar cm nitesh kumar had barrow five rupees

ముఖ్యమంత్రి అంటే డబ్బుకు, డాబుకు ఏమాత్రం తక్కువ ఉండదు. మరి అలాంటి సిఎం గారి జేబులో పైసా లేకుండా పరిస్థితి ఎలా ఉంటుంది. బీహార్  ముఖ్యమంత్రి నితిశ్ కుమార్  విచిత్రమైన పరిస్థితికి లోనయ్యారు. జేబులో పైసా లేకుండా బస్సు ఎక్కేశారు. తీరా మహిళా కండక్టర్ రూ. 5 టికెట్ చేతిలో పెట్టేటప్పడికి జేబులు తడుముకున్నారు.  బస్సులో ప్రయాణిస్తున్న ప్రభుత్వాధికారి  సీఎం టికెట్ కు  5రూపాయలు చెల్లించాడు.  సీఎం  గాంధీ మైదాన్ నుంచి పట్నా స్టేషన్ కు ప్రయాణిస్తుండగా ఈ పరిస్థితి ఎదురైంది.  ముఖ్యమంత్రి అయినా.. నితిశ్ కుమార్ జేబులో  పర్సు కానీ, డబ్బులు కానీ పెట్టుకోరట.  సీఎం తో పాటు  బస్సులో  అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా  ప్రయాణిస్తున్నారు.  సీఎం పరిస్థితి చూసి  టికెట్ కు డబ్బులు చెల్లించారు.

నితిశ్ కుమార్  జేబులో డబ్బులు లేక ఇబ్బందులు పడడం ఇదే  మొదటిసారి కాదు.  గతంలో పార్టీ సభ్యత్వం  రిన్యువల్ చేసుకోడానికి పైసా లేకపోతే  జేడీయూ అధికారప్రతినిధి సంజయ్ సింగ్  నితిశ్  రిన్యువల్ ఫీజు చెల్లించాడట. 1985లో  ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన భార్యే ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చిందట.  నితిశ్ కుమార్  ఓ సభలో ఈ విషయాలు చెప్పి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపకారాన్ని గుర్తు చేసుకున్నారు.   మహిళలకోసం ప్రత్యేక బస్సుల్లో మహిళా కండక్టర్లే కాదు, మహిళా డ్రైవర్ లను నియమించాలని  రవాణా శాఖను నితిశ్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitesh Kumar  Barrow  Patna  

Other Articles