Balakrishna kicks off Cycle Yatra for Lepakshi festival

Balakrishna kicks off cycle yatra for lepakshi festival

Balakrishna, Hindupur, Lepakshi, Lepakshi Festival

Actor turned Hindupuram MLA Balakrishna has begun Cycle Yatra in Hindupuram on Wednesday as part of promoting Lepakshi festival in Anantpur district. The Cycle Yatra kicked off from Kodikonda check post to Lepakshi Nandi statue with 500 members.

ITEMVIDEOS: 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన బాలకృష్ణ

Posted: 02/24/2016 01:18 PM IST
Balakrishna kicks off cycle yatra for lepakshi festival

హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సైకిల్ తొక్కారు. అది కూడా ఏదో మామూలుగా కాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. బాలకృష్ణ సైకిల్ తొక్కడానికి ఓ కారణం కూడా ఉంది. అనంతపురంలోని లేపాక్షి ఉత్సవాల సందర్భంగా గత కొన్ని రోజుల నుండి బాలకృష్ణ ఆ ఉత్సవాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గతంలోనే ఓ వీడియోను విడుదల చేసిన బాలకృష్ణ తాజాగా మరోసారి సైకిల్ యాత్ర ద్వారా లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నారు.

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొరికొండ చెక్ పోస్ట్ నుండి లేపాక్షి నంది విగ్రహం వరకు బాలకృష్ణ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 16 కిలో మీటర్లు సైకిల్ తొక్కి నలభై నిమిషాల్లో లేపాక్షికి చేరుకున్నారు. లేపాక్షి ఉత్సవాలను ఈ సారి ప్రభుత్వం ఎంతో లాంఛనంగా నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవం ఉన్న లేపాక్షికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా...  లేపాక్షి చరిత్ర,  వైభవం తెలియజేసేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Hindupur  Lepakshi  Lepakshi Festival  

Other Articles