Jagan can Destroy Ap Govt If possible

Jagan can destroy ap govt if possible

nara Lokesh, nara chnadrababu Naidu, Lokesh, YS Jagan, Jagan, AP, AP Govt

Nara Lokesh challenge to YS Jagan for Destroy ap govt statements. He said that opposition leaders joining into TDp because of development

చేతనైతే ఒక్క రోజులో ప్రభుత్వాన్ని కూల్చాలి

Posted: 02/24/2016 12:59 PM IST
Jagan can destroy ap govt if possible

జగన్ కు చేతనైతే ఒక్క రోజులో ప్రభుత్వాన్ని కూల్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.కొద్ది రోజుల క్రితం ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఒక్క రోజులోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తానని అన్నారు. ఇరవై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కూడా జగన్ వెల్లడించారు. అలా జగన్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తర్వాత వైసీపీ చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యు కట్టారు.

జగన్ మీద తీవ్ర స్థాయిలో మండిపడిన లోకేశ్.. చేతనైతే ప్రభుత్వాన్ని కూల్చాలని అన్నారు. తమ పార్టీ చేపడుతున్న అభివృద్ది పనులను చూసే చాలా మంది ప్రతిపక్ష నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని వారిని తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కూడా లోకేశ్ అన్నారు. టీఆర్ఎస్ తో వైసీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచెయ్యలేదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara Lokesh  nara chnadrababu Naidu  Lokesh  YS Jagan  Jagan  AP  AP Govt  

Other Articles