Who is using child as political tool

Who is using child as political tool

Smriti Irani, HCU, JNU, Rajya sabha, Parliament

Rajya Sabha will debate Jawaharlal Nehru University row and Hyderabad University controversy today with opposition trying to corner the Narendra Modi government. BJP and its allies have decided to aggressively counter Congress and the Left in Parliament over the issues.

విద్యార్థి చావును రాజకీయం చేస్తున్నారు

Posted: 02/24/2016 01:36 PM IST
Who is using child as political tool

రాజ్యసభకు క్యాంపస్ సెగలు అంటుకున్నాయి. హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలపై రగడ కొనసాగుతుంది. సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఐదోసారి సభ వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని బీఎస్పీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన కమిటీలో దళిత సభ్యుడికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్ధికి విపక్షాలు వాడుకుంటున్నాయని విమర్శించారు. 'పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయి' అని ఆమె చిర్రుబుర్రులాడారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబంధమూ లేదని స్మృతి ఇరానీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  HCU  JNU  Rajya sabha  Parliament  

Other Articles