Onions rate down to three hundred rupees per quintal

Onions rate down to three hundred rupees per quintal

Onions, Hyderabad, Telangana, Summer, Onions Production

The arrival of fresh summer crop has commenced at the country's largest wholesale onion market at Lasalgaon Agriculture Produce Market Committee (APMC) but in a very less quantity. The Lasalgaon APMC recorded arrival of around 100 quintals of fresh summer onions on Monday from the total arrivals of 15,000 quintals.The regular arrival of the summer crop is expected to begin from the second half of March. At present, the onions arriving in the market are of late kharif crop. The summer crop usually gets good prices as compared with the kharif crop due to its longer shelf life.

కిలో ఉల్లి మూడు రూపాయలు.. కన్నీరు పెడుతున్న రైతు

Posted: 02/23/2016 12:34 PM IST
Onions rate down to three hundred rupees per quintal

ఉంటే ఆకాశంలో లేదంటే పాతాళంలో అన్నట్లు ఉల్లి ధరలున్నాయి. రెండు నెలల క్రితం కనీసం చూద్దామంటే కూడా కనిపించని ఉల్లి  ఏకంగా సెంచరీ కొట్టింది. పాపం మధ్య తరగతి వాళ్లకు ఉల్లి కొంత కాలంపాటు దూరం కూడా అయింది. నిన్నటి దాకా కన్నీళ్లు పెట్టించిన  ఉల్లి.. ఇప్పుడు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమాంతంగా తగ్గిన ఉల్లి ధరలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. రైతులు, వ్యాపారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటివరకు కిలో రూ.20 ధర పలికిన ఉల్లి ఒక్క సారిగా రూ.3కు పడిపోయింది. ఒక క్వింటా ఉల్లి కేవలం రూ.600 మాత్రమే పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రెండో రకం ఉల్లి క్వింటాలుకు కనిష్టంగా రూ.300 మొదలుకొని గరిష్టంగా రూ.600లకు విక్రయాలు జరిగాయి.

చిల్లర అమ్మకాలను మానేసి హోల్ సేల్ మార్కెట్ వైపు మొగ్గుచూపుతుంటే కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని అమాంతంగా పెంచి ప్రధాన పంటగా సాగుచేయడం... దీనికి తోడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం పెరగడం, పంటదిగుబడులు ఎక్కువగా ఉండటంతో సరఫరా పెరిగి డిమాండ్ పడిపోయి ధరలు తగ్గాయి. మరోవైపు సరైన స్టోరేజీలు(గోదాములు) లేకపోవడంతో ధరలు తగ్గటానికి ఒక కారణంగా చెబుతున్నారు. వారంరోజుల్లో ఉల్లి పూర్తి కనిష్టస్థాయికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onions  Hyderabad  Telangana  Summer  Onions Production  

Other Articles