Chandrababu Naidu check jagan with political strategy

Chandrababu naidu check jagan with political strategy

YS Jagan, Jagan, JaganMohan Reddy, YSRCP, AP, Chandrababu Naidu, Roja, TDP, Bhuma Nagi Reddy

Jagan told that twenty TDP MLAs ready to join into his party. But chandrababu Naidu shocks Jagan and YSRCP.

చంద్రబాబు ఒక్క దెబ్బకు జగన్ హడల్

Posted: 02/23/2016 01:16 PM IST
Chandrababu naidu check jagan with political strategy

మా తాతలు నేతులు తాగారు.. కావాలంటే మా మూతులు చూడండి అంటే ఇప్పట్లో ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మాటల కన్నా చేతలకే జనం జై కొడతారు. ఏపిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా... ఇదీ ఒక ప్రభుత్వమా అంటే ఏవోవో మాటలు చెప్పారు. రాజకీయ అనుభవం ఉన్నంత మాత్రాన సరిపోదని.... ఏ పనినైనా చేసే దమ్ముండాలని తొడ గొట్టి మరీ సవాల్ చేస్తారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క దెబ్బతో ఖంగుతిన్నారు. జగన్ మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా చేయాల్సిన పని కానించేశారు.

అణువుగాని చోట అధికులమనరాదు.. అని వేమన ఎప్పుడో చెప్పాడు.. కానీ మనకు ఇప్పటికీ దాని మీద అవగాహన రావడం లేదు. పూర్తి మెజారీటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద జగన్ దుమ్మెత్తిపోశారు. అయితే బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా ఆ బాధ్యత ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు పర్సనల్ లైఫ్ తో కూ డాజగన్ రాజకీయం చేశారు. ఇక జగన్ మాట్లాడిన తర్వాత వెంటనే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు మీద బండబూతులు మాట్లాడే రోజాకు కూడా చంద్రబాబు నాయుడు మంచి సమాధానమే ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకు పెద్ద విషయం కాదు... మాతో ఇరవై మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని జగన్ గొప్పగా ప్రకటించారు. కానీ సరిగ్గా రెండు వారాలు కూడా తిరగకుండా జగన్ కు దిమ్మతిరిపోయేలా చంద్రబాబు షాకిచ్చారు. అసలు ముందు మీ సంగతి చూసుకోండి.. తర్వాత మా సంగతి చూద్దురు కానీ అన్నట్లు వ్యవహరించారు. అందులో బాగంగా తెలుగుదేశం పార్టీ లోకి వైసీపీ నాయకులను చేర్చుకుంటున్నారు సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. దాంతో వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

అసలు టిడిపి పార్టీలో ఏముందని ఆ పార్టీలో చేరుతారు అని రోజా అన్నా.. సైలైంట్ గా పని చేస్తున్న చంద్రబాబు. భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లాలో టిడిపిలో చేరుతారు అన్న వార్తలతో హడావిడిగా సమావేశం నిర్వహించారు మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలకు దిగారు. ఇక పార్టీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ఉంది అని తెలియడంతో సెకండ్ క్యాడర్ నేతలతో చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కానీ అసలు వారికి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చెయ్యాల్సిన అవసరం ఏంటి అంటే మాత్రం జగన్ ఆత్మరక్షణలో పడ్డారు అందుకే చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి విమర్శలకు ప్రోత్సహిస్తున్నారు అన్నది అందరికి తెలిసిన నిజం.

ఇరవై మంది ఎమ్మెల్యేలు నా పక్షాన ఉన్నారు అని ప్రనకటించిన జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. నిన్న ఒక్క రోజే చంద్రబాబు నాయుడు సమక్షంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కి.. తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి లాంటి కీలకనేత పార్టీని వీడటం సీమలో పార్టీకి ఎదురుదెబ్బే అని గ్రహించిన జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందుకు జగన్ మీడియా కూడా సహకరిస్తోంది. అందుకే సాక్షిలో భూమాతో సహా పలువరు ఎమ్మెల్యేల చేరిక మీద తన స్టైల్లో స్పందించింది. తన కతనంలో చంద్రబాబు 66 మంది ఎమ్మెల్యేల కోసం పైరవీ చేశారని కానీ అందులో కేవలం నలుగురు మాత్రమే దక్కారని కథనం రాసింది. అలాగే కడప, కర్నూల్ జిల్లాలో అసమ్మతి రాజుకుందని కూడా రాసింది.

వాపు చూసి జబ్బులు చరిస్తే ఇలాగే ఉంటుందని వైసీపీ అధినేత జగన్ కు ఇప్పటికైనా అర్థమైందో లేదో మరి. అయినా చంద్రబాబు నాయుడు ఎంత రాజకీయ చాణిక్యుడో జాతీయ స్థాయిలో అందరికి తెలుసు. కానీ తనకు వచ్చిన సీట్లతో రెచ్చిపోయిన జగన్ తన తరహా రాజకీయాన్ని నడిపారు. దాంతో చంద్రబాబు నాయుడు తన స్టైల్లో సైలెంట్ గా వైసీపీ నాయకులను లాగి... తెలుగుదేశం సైకిల్ ఎక్కేటట్లు చేశారు. అయినా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ పని తీరు మీద విమర్శించాల్సిన వైసీపీ చేరికలు, కూడికల మీద లెక్కలు వేసుకుంటుండంతో జగన్ కు చంద్రబాబు పక్కా ప్లాన్ తో చెక్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Jagan  JaganMohan Reddy  YSRCP  AP  Chandrababu Naidu  Roja  TDP  Bhuma Nagi Reddy  

Other Articles