Fire accident in Ameerpet Jewelers

Fire accident in ameerpet jewelers

Ameerpet, Hyderabad, Jewellers, Fire Accident

In Hyderabad, Ameerpet, fire accident in a new Jewelry. Fire Engine reached the Jewelers and controls fire.

అమీర్ పేట్ నగల దుకాణంలో అగ్నిప్రమాదం

Posted: 02/22/2016 08:36 AM IST
Fire accident in ameerpet jewelers


హైదరాబాదులోని అమీర్ పేటలో ఓ నగల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ జువెలరీ షాపు మటంల్లో దగ్ధమైంది. అమీర్ పేటలోని గురుద్వారా సమీపంలో కొత్తగా ఓ నగల దుకాణం రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ ఉదయం ఉన్నట్టుండి షాపులో మంటలు చెలరేగాయి.. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వారు వచ్చే లోపుగానే షాపు మొత్తం తగలబడిపోయింది. త్వరలో జరగనున్న ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీ ఎత్తున సేకరించిన నగలన్నీ ఈ ప్రమాదంలో కాలి బూడిదైనట్లు సమాచారం. తద్వారా నష్టం కోట్లలో జరిగినట్లు తెలుస్తోంది.ఆగంతుకుల పనే అని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ameerpet  Hyderabad  Jewellers  Fire Accident  

Other Articles