Homs and Damascus bomb blasts kill 140

Homs and damascus bomb blasts kill 140

Syria, Bomb Blasts, Terror Attack, ISIS, Rebals

At least four blasts struck the southern Damascus suburb of Sayyida Zeinab, killing at least 83 people, state media said. Earlier in Homs, 57 people, mainly civilians, were killed in a double car bombing, a monitoring group reported. So-called Islamic State (IS) said it carried out the attacks in both cities.

సిరియాలో మారణహోమం.. 140 మంది మృతి

Posted: 02/22/2016 08:20 AM IST
Homs and damascus bomb blasts kill 140

సిరియాలో మరోపారి మారణహోమం జరిగింది. వరుస బాంబు పేలుళ్లతో సిరియా దద్దరిల్లింది. మొత్తం నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు సిరియా మానవహక్కుల అధ్యయన వేదిక తెలిపింది. హోమ్స్ నగరంలో జరిగిన జంట కారు బాంబుపేలుళ్లలో 57 మంది మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా సాధారణ పౌరులేనని సిరియా మానవహక్కుల అధ్యయన వేదిక తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది.

రాజధాని డమాస్కస్‌ లోని షియా ముస్లింల ప్రార్థనా స్థలం వద్ద జరిగిన కారు బాంబు పేలుళ్లలో 62 మంది మృతిచెందారు. సయ్యిదా జీనబ్ ప్రార్థనా మందిరం ప్రాంతంలో ఇద్దరు ఆత్మాహుతి దళాలు, ఓ కారు బాంబు పేలుడు సంభవించినట్టు సిరియా జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు అలెప్పో నగరంలో 24గంటల్లో సిరియా ప్రభుత్వ దళాలు, రష్యా సైన్యం సంయుక్తంగా జరిపిన దాడుల్లో 50మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతిచెందినట్టు మానవహక్కుల అధ్యయన వేదిక పేర్కొంది. సిరియా సైన్యం ఐఎస్ చెరలో ఉన్న అనేక గ్రామాలను విడిపించుకుంటూ ఈ దాడులకు పాల్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syria  Bomb Blasts  Terror Attack  ISIS  Rebals  

Other Articles