దేశీయంగా నెలకొన్న పటిష్ట డిమాండ్ పసిడికి మెరుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం మెరుపులు తలుక్కుమనడంతో పాటు దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు రావడం కూడా కుందనానికి వెలుగులను ఇచ్చింది. ముంబై స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర గురువారం ముగింపుతో పోల్చిచూస్తే.. రూ.525 ఎగసి రూ.29,095కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగసి రూ.28,945 పెరిగింది. ఇక వెండి కేజీ ధర రూ.395 ఎగసి రూ.37,690కి పెరిగింది. ముంబైలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రధాన స్పాట్ మార్కెట్లు అన్నింటిలో పసిడి ధర క్రితం రోజు భారీగా ఎగసింది.
దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల కొనుగోళ్లు తాజా డిమాండ్‌కు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కడపటి సమాచారం అందేసరికి అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లలో కూడా పసిడి లాభాల్లోనే ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు ఐదు డాలర్ల లాభంతో 1,231 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో రూ.250 లాభంతో రూ.29,560 వద్ద ట్రేడవుతోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Jan 27 | భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం... Read more
Jan 27 | చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే... Read more
Jan 27 | జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన... Read more
Jan 27 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం... Read more
Jan 27 | ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్... Read more