will give the housing loans to those who related to tdp minister bojjala

Housing loans to tdp activists says minister bojjala

Andhra Pradesh, chandra babu, ap chief minister chandra babu, Minister Bojjala Gopal Krishna Reddy, TDP activists, housing loans, housing loans to tdp activists

Andhra Pradesh Minister Bojjala gopala krishna reddy says will provide housing loans to his state wide party activists

ఇళ్ల రుణాలలో మంత్రి బొజ్జల గోపాలుడు లెక్క ఎట్టిదనిన..

Posted: 02/17/2016 03:39 PM IST
Housing loans to tdp activists says minister bojjala

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇళ్ల రుణాలు మంజూరు చేస్తామంటూ ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలందరినీ ఒకేలా చూస్తామని ప్రకటించి ఊరారా తిరిగి ఓట్లు వేయించుకునే పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చి రాగానే పార్టీ కార్యకర్తలకే అగ్రతాంబూలం ఇవ్వడం ఎంత వరకు సమంజసమో అమాత్యులకే తెలియాలి.

పశ్చిమ గోదావరి అకివీడులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో కొద్దిపాటి ఇళ్లే మంజూరవుతున్నందున ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్లకే అవకాశమిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు కూడా విస్మయం వ్యక్తం చేసి ప్రశ్నలు కురిపించగా.. అందులో తప్పేముందని ఆయన ఎదురుదాడి చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల రుణాలు మంజూరుచేస్తే తప్పేంటని బొజ్జల ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  chandra babu  Minister Bojjala Gopal Krishna Reddy  TDP activists  

Other Articles