Two female passengers are shocked to find their airline puts them together inside a LOVE HOTEL

Two female passengers are shocked to find their airline puts them together inside a love hotel

China, Airlines, Love Hotel

Two women got the ultimate shock when an airline provided them with a 'love hotel' for the night when their flight was delayed on Valentine's Day. The strangers were horrified when they were sent to share a room that looked more like a brothel fully equipped for a night of bondage

ఫ్లైట్ లేటైతే అమ్మాయిలను ఆ రూంలోకి....

Posted: 02/17/2016 03:45 PM IST
Two female passengers are shocked to find their airline puts them together inside a love hotel

మేడం ఫ్లైట్ లేట్ అవుతోంది కాబట్టి మీరు అప్పటిదాకా ఆ రూంలో ఉండండి అని ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇద్దరు అమ్మాయిలతో అన్నారు. సరే వెయిట్ చెయ్యడం ఆ రూంలోనే చేద్దామని అక్కడికి వెళ్లిన అమ్మాయిలకు అనుకోని షాక్ తగిలింది. దాంతో ఆగ్రహించిన అమ్మాయిలు వెంటనే ఆ రూం ఫోటోలను, సెల్ఫీలను దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇంతకీ అక్కడ వారికి ఏం కనిపించాయో తెలుసా..? కండోమ్ ప్యాకెట్లు, సెక్సీ ఫోజులిస్తున్న వాల్ పోస్టర్లు, హ్యాండ్ కఫ్ లు ఉన్నాయి. తీరా ఎంక్వైరే చేస్తే ఆ హోటల్ లో ఎక్కువగా సెక్స్ ఇష్టపడే వారుంటారని తేలింది.

ఇటీవల చైనాలోని చాంగ్‌క్వింగ్‌ నుంచి హాంగ్జౌకు వెళ్లేందుకు లౌబౌ అనే యువతి విమానాశ్రయానికి వచ్చింది. అయితే మంచు తుఫాను కారణంగా ఆ విమానం 24 గంటలు లేటని తెలిపారు నిర్వాహకులు. అయితే అప్పటివరకు ఉచితంగా హోటల్‌ రూమ్‌లో ఉండే ఏర్పాటు చేస్తామన్నారు. అన్నట్టుగానే లౌబౌతోపాటు మరో యువతికి ఓ హోటల్‌ రూమ్‌ కీ ఇచ్చారు. అయితే ఆ రూమ్‌ను చూసిన ఆ ఇద్దరు యువతులు ఆశ్చర్యపోయారు. అక్కడ కండోమ్ ప్యాకెట్లు, పోస్టర్లు చూసి షాక్ అయ్యారు. అయితే దీని మీద అమ్మాయిలు ఆగ్రహం వ్యక్తం చేయగా... వెయిర్ లైన్స్ సిబ్బంది మాత్రం వేరేలా సమాధాపం చెబుతున్నారు. ఇది బాగా చర్చనీయాంశం అవడంతో సదరు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు స్పందించారు. ఆ రోజు చాలా విమానాలు రద్దయ్యాయని, వేలమంది ప్రయాణికులకు వసతి కల్పించాల్సి వచ్చిందని, అందువల్లే హోటల్స్‌ చాలక ఈ తరహా హోటల్‌ రూమ్స్‌ కూడా తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Airlines  Love Hotel  

Other Articles