I Was physically assulted by congress minister says rajkhowa to sc

Arunachal pradesh governor rajkhowa tells supreme court that state minister tried to assault

JP Rajkhowa,Arunachal Pradesh,Arunachal Pradesh Governor JP Rajkhowa, Governor, Rajkhowa, Supreme Court, assault

According to media sources, Arunachal Pradesh Governor Jyoti Prasad Rajkhowa told the Supreme Court on Tuesday that he was physically assaulted by Congress Ministers. He also added that he has acted according to the Constitution.

రాష్ట్రపతి పాలన సిఫార్సుపై అసలు విషయాన్ని చెప్పిన గవర్నర్

Posted: 02/10/2016 05:58 PM IST
Arunachal pradesh governor rajkhowa tells supreme court that state minister tried to assault

రోజుకో మలుపు తిరుగుతోన్న అరుణాచల్ ప్రదేశ్ రాజకీయంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసరంగా రాష్ట్రపతి పాలనను ఎందుకు సిఫార్సుచేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ జేపి రాజ్ ఖోవా సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఇప్పటివరకు వెలుగుచూడని విషయాలు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నబాం టుకీకి అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి తనపై దాడికి యత్నించాడని గవర్నర్ బాంబు పేల్చారు.

'రాష్ట్రంలో నానాటికీ క్షీణిస్తోన్న శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపాను. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవసరమైన సూచనలు చేశా. ఆ క్రమంలో డిసెంబర్ 14న సీఎం టుకీ, కొద్దిమంది మంత్రులతో జరిగిన సమావేశంలో ఓ మంత్రి నాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఆ చర్య నన్నెంతో కలిచివేసింది. గవర్నర్నైన నాకే అలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్రపతి పాలను సిఫార్సు చేశా' అని గవర్నర్ రాజ్ ఖోవా సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  Governor  Rajkhowa  Supreme Court  assault  

Other Articles