telangana tourism helicaptor joy ride in summer

Telangana tourism offers helicopter joy ride to hyderabadis

telangana government, Helicopter, Joy Ride, Hussain Sagar, telangana tourism, hyderabad trip in helicopter, helicopter ride in summer, tourism plans to raise funds, telangana government, heli pad at sagar

Telangana tourism planning hyderbad trip by helicopter for interested in comming summer

వేసవిలో నగరాన్ని చుట్టేస్తారా.. హెలికాఫ్టర్ లో జాలీగా..

Posted: 02/10/2016 05:46 PM IST
Telangana tourism offers helicopter joy ride to hyderabadis

వేసవిలో నగరారంరి చుట్టేయాలని అనుకుంటున్నారా..? అబ్బో అసలే వేడి.. ఈ తరుణంలో ఇంట్లోంచి బయటకు రావడానికే అయిష్టత వ్యక్తం చేస్తున్నవారిలో మేమే ముందుంటాం అంటున్నారా. అయితే ఆ జాలీ ట్రిప్ ఏ కారులోనో, బైక్ పైనో కాదు.. హెలికాప్టర్ లో అంటే మీ ఫీలింగ్ ఏంటి..? నిజమేనండి.. హెలికాఫ్టర్ లో జాయ్ రైడ్‌కు హుస్సేన్‌సాగర తీరం ఈ వేసవిలో వేదిక కానుంది. నగరంలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను ప్రారంభించేందుకు టూరి జం శాఖ సన్నాహాలు చేస్తోందని, ఇందుకోసం హుస్సేన్‌సాగర్ తీరంలో 30 మీటర్ల విస్తీర్ణంలో హెలీప్యాడ్‌ను నిర్మించాలని హెచ్‌ఎండీఏను కోరింది.

నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు సమీపంలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) కొత్తగా ఓ హెలీప్యాడ్‌ను రూపొందిస్తోంది. గతంలో ‘బీచ్ వాలీబాల్’ పోటీల కోసం కోర్టును నిర్మించిన స్థలంలో ఇప్పుడు హెలీప్యాడ్ సిద్ధమవుతోంది. సుమారు 30 మీటర్ల విస్తీర్ణంలో రూ.4 లక్షల వ్యయంతో ఈ హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఆ మేరకు నెక్లెస్‌రోడ్‌లో హెలీప్యాడ్‌ను రూపొందిస్తున్నారు. నగరాన్ని సందర్శించే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని నెలరోజుల పాటు హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను నిర్వహించాలని పర్యాటక శాఖ భావిస్తోందన్నారు.

ఈ జాయ్ రైడ్‌ను వేసవిలో ప్రారంభించే అవకాశం ఉందని, హెలికాప్టర్ హైదరాబాద్ నగరం చుట్టూ ఓ రౌండ్ కొట్టి సాగర్ వద్ద ల్యాండ్ అవుతుందని వివరించారు. ఈ రైడ్ ఎంత సేపు ఉంటుంది? ఎంత చార్జీ వసూలు చేస్తారు? వంటివి పర్యాటక శాఖే నిర్ణయించి నిర్వహిస్తుందని తెలిపారు. హెలికాప్టర్ జాయ్ రైడ్‌కు ఏవియేషన్ క్లియరెన్స్, ఇతర అనుమతులన్నీ టూరిజం శాఖ తెచ్చుకుంటుందని తెలిపారు. హెలీప్యాడ్‌ను వారం రోజుల్లో పూర్తి చేసి టూరిజం శాఖకు అప్పగిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana government  Helicopter  Joy Ride  Hussain Sagar  

Other Articles