fake currency business in west godavari gorantla

Fake currency from dubai to gorantla via karnataka

fake currency notes in ap, fake currency notes in west godavari, fake currency notes in gorantla, fake currency notes printed in dubai, fake currency notes distributed via karnatana, Fake notes, Fake currency Business, Gorantla

fake currency notes mess up in west godavari district gorantla, which are printed in dubai and are distributed via karnatana

నకిలీ కరెన్సీ.. దుబాయ్ నుంచి గోరంట్లకు.. వయా కర్నాటక

Posted: 02/10/2016 05:25 PM IST
Fake currency from dubai to gorantla via karnataka

గోరంట్ల కేంద్రంగా నకిలీ నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నాలుగు వందలకు వెయ్య రూపాయాలను ఇస్తూ కేటుగాళ్లు.. నకిలీ కరెన్సీని యదేశ్చగా మారుస్తుండగా, అటు రెండున్నరింతల లాబాం వచ్చే సరికి అనేక మంది నకిలీ కరెన్సీ మార్చే పనుల్లో నిమగ్నమవుతున్నారు. పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఇక్కడకు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమాచారం. గోరంట్లలోని ఆరు క్రియాశీలక కేంద్రాలకు తొలుత నకిలీ కరెన్సీ చేరుతోంది. అక్కడి నుంచి ఈ అక్రమ వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 40 అసలు నోటు ఇస్తే రూ. 100 నకిలీ నోటు ఇస్తున్నారు.

దీంతో చాలా మంది గ్రామీణులు, యువత ఈ అక్రమ వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా ముద్రించిన నకిలీ కరెన్సీ.. అటు నుంచి దుబాయ్ మీదుగా ఇక్కడకు దిగుమతి అవుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫైనాన్స్, చీటి నిర్వాహకుల ద్వారా నకిలీ నోట్లు మార్కెట్‌లోకి చెలామణి అవుతోందన్న విమర్శలున్నాయి. వీటిలో రూ. 500, రూ.1000 నోట్లే అధికంగా ఉండడం గమనార్హం. దీనిపై స్థానిక పోలీసులు నకిలీ నోట్ల చెలామణిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నకిలీ కరెన్సీని మారిస్తే కఠిన చర్యలు వుంటాయని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake notes  Fake currency Business  Gorantla  

Other Articles