If u dont carry driving licence they be ready to go jail

If u dont carry driving licence they be ready to go jail

driving, Hyderabad, Traffic Police, Hyderabad Police

In Hyderabad Traffic police implementing strickt rules on Traffic. They are instructing to carry License while driving.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలే

Posted: 01/27/2016 03:50 PM IST
If u dont carry driving licence they be ready to go jail

బాబూ.. వాహనాల మీతద వెళ్తుంటే.. హెల్మెట్లే పెట్టుకోండి.. మీతో డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్లండి అంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంతలా సలహాలిస్తున్నా కానీ చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. అయితే ఇక మీదట బుజ్జగింపులు ఉండవు.. ఓన్లీ వాయింపులే అన్నట్లు హైదరాబాద్ పోలీసులు సిద్దమవుతున్నారు. కేర్ లెస్ గా డ్రైవింగ్ చేసినా, లైసెన్స్ లేకుండా బండిపై బయటకు వెళ్లినా భారీ జరిమానాతో పాటు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లెసెన్స్ ను శాశ్వతంగా కోల్పోవాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనీసం మూడుసార్లు పట్టుబడేవారిపై ఛార్జిషీటు దాఖలు చేసి, 3 నెలల కారాగార శిక్షను వేసేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మైనర్లు కూడా దీనికి మినహాయింపు కారు. ఈ ప్రక్రియకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానాలు ఆమోదం తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక మీదట ప్రమాదానికి కారణమైన వ్యక్తి 10 వేల రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ టైమ్ ప్రమాదం చేస్తే… వారి డ్రైవింగ్ లైసెన్స్ పై రెడ్ మార్క్ పడుతుంది. ఇలా 3 సార్లు ఎర్ర టిక్కులు పడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుంది. ప్రమాదాల నివారణకు ప్రతి రెవెన్యూ డివిజన్ లో తాత్కాలికంగా ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి మూడో వారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలోనే కాదు వాహన ఫిట్ నెస్ పరీక్షలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. వాహనాన్ని రవాహణాశాఖ స్వాధీనం చేసుకుని ఫిట్ నెస్ కేంద్రాలకు పంపిస్తుంది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల వాహనాలుంటే.. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది మాత్రం 60 లక్షమందికే. హైదరాబాద్ లో 43 లక్షల వాహనాలుంటే.. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : driving  Hyderabad  Traffic Police  Hyderabad Police  

Other Articles