Virat Kohli's fan in Pakistan hoists Indian flag at home

Virat kohli s fan in pakistan hoists indian flag at home

Pakistan, India, Indian flag in pakistan, Pakistan on India, Kohli, Virat Kohli

A Pakistani die-hard fan of swashbuckling Indian batsman Virat Kohli has been arrested for hoisting the Indian tri-colour atop his home in Punjab Province which he had done to show his love for the cricketer. Umar Draz, from Okara district of Punjab province, about 200 km from Lahore, was arrested on a complaint that he hoisted the Indian flag on the rooftop of his house as police raided his home on Tuesday, 26th January - India's Republic Day.

పాక్ లో భారత జెండా.. కోహ్లీ అభిమాని అరెస్ట్

Posted: 01/27/2016 03:12 PM IST
Virat kohli s fan in pakistan hoists indian flag at home

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. పాకిస్థాన్ దేశంలోనే మన జాతీయ జెండా మువ్వన్నెలు రెపరెపలాడాయి. ఇండియా పాకిస్థాన్ అంటే కయ్యానికి కాలు దువ్వడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండే బద్దశత్రువులు అని అందరికి తెలుసు. పాకిస్థాన్ లో భారత్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. కానీ తాజాగా రిపబ్లిక్ డే నాడు పాకిస్థాన్ లో.. అది కూడా లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో బారత జాతీయ జెండా ఎగరింది. కాగా అందుకు గాను భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు.

పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు  చెందిన ఉమర్ ద్రాజ్ కోహ్లిపై తన అభిమానాన్ని చాటుకుంటూ తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఒకారా జిల్లాలోని నివసిస్తున్నఅతడు మంగళవారం తన ఇంటిపైకప్పు భారత జాతీయజెండాను ఎగురవేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో అతని ఇంటిపై తాము దాడి చేసి.. ఇంటిపైకప్పుమీద ఎగురుతున్న భారత జెండాను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. అతన్ని అరెస్టు చేసి.. అదే రోజున కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అతనికి కస్టడీ విధించిందని ఆయన వివరించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లికి తాను వీరాభిమానినని, అతనిపై అభిమానం చాటుకునేందుకే భారత జెండాను తన ఇంటి పైకప్పు మీద  ఎగురవేశానని ఉమర్ ద్రాజ్ విలేకరులకు తెలిపాడు. తాను చేసింది తప్పు అనే విషయం తనకు తెలియదని, తనను క్షమించి వదిలిపెట్టాలని ఆయన పోలీసులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Indian flag in pakistan  Pakistan on India  Kohli  Virat Kohli  

Other Articles