Australia vs India 2016, 4th ODI: Australia set big target despite losing wickets

Australia hits 348 8 in 4th odi vs india

ind vs aus, india vs australia, india australia, australia vs india, virat kohli, kohli, shikhar dhawan, dhawan, cricket,4th ODI, Aaron Finch, Australia, Australia vs India 2016, Canberra, Cricket, free cricket streaming, George Bailey, India, Josh Hazlewood, MS Dhoni, Ravichandran Ashwin, Rohit Sharma, Steven Smith, Virat Kohli

Aaron Finch struck his seventh hundred in a blistering opening partnership of 187 with David Warner to power Australia to 348 for eight wickets in the fourth one-day international against India in Canberra on Wednesday.

భారత్ ఎదుట భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన అసిస్

Posted: 01/20/2016 04:01 PM IST
Australia hits 348 8 in 4th odi vs india

ఆస్ట్రేలియా పర్యటిస్తున్న భారత జట్టుకు అహ్వాన జట్టు నాలుగో వన్డేలో భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. అహ్వాన జట్టుతో జరుగుతున్న వన్డే సీరిస్ లో భాగంగా ఇప్పటికే వరుసగా మూడు అపజయాలను మూటగట్టుకున్న టీమిండియా వన్డే సిరీస్ ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ జరుగుతున్న నాల్గవ వన్డేలో అసీస్ ధోనిసేనకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపనర్లు టీమిండియా బౌలర్లును చితకబాది శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్  డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు తమ శక్తినంతా ధారపోసినా.. శతకమున్నర భాగస్వామ్యం తరువాతే అది సాధ్యపడింది. ఇక విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా పేరున్న అసీస్ కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు.

ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ జోడీ 187 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లు 29 ఓవర్లు పాటు శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఎట్టకేలకు ఆ మరుసటి ఓవర్లో వార్నర్ ను భారత పేసర్ ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఫించ్.. మార్ష్ అదే జోరు కొనసాగించారు. సెంచరీ చేసిన తర్వాత ఫించ్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ మరింత దూకుడుగా ఆడాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన వెంటనే స్మిత్ అవుటయ్యాడు. కాగా అప్పటికే ఆసీస్ స్కోరు 300 కు చేరువైంది. చివరల్లో మ్యాక్స్ వెల్ విజృంభించాడు. 20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 41 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా ముందు భారీ టార్గెట్ ఉంచింది. భారత్ బౌలర్లు ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  indvsaus  cricket  Australia  Teamindia  ODI Series  

Other Articles