India A Step Closer To Desi-GPS With Latest Satellite Launch

India a step closer to desi gps with latest satellite launch

ISRO, Launch India Regional Navigation Satellite System, IRNSS-1, EPSLV-C31, GPS

Space agency ISRO this morning successfully launched India's fifth navigation satellite, the IRNSS-1E, in space, moving a step closer to what is being called an operational "desi GPS" or home-grown Global Positioning System.

ఇది మన జీపీఎస్.. ఇస్రో ఖాతాలో మరో విజయం

Posted: 01/20/2016 04:38 PM IST
India a step closer to desi gps with latest satellite launch

భారత అంతరిక్ష చరిత్రలో మరో కీర్తపతాకం చేరింది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో తన ఖాతాలొ మరో విజయవంతమైన ప్రయోగాన్ని నమోదు చేసుకుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ఈ ఉదయాన్నే విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది రాకెట్ టేకాఫ్ తీసుకున్న 18 నిమిషాల 75 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అన్ని దశల్లోనూ నిర్ణీత సమయాల్లోనే రాకెట్ సపరేషన్ కొనసాగింది. ఐఆర్‌ఎన్‌ఎస్ రోదసి ప్రయోగాల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ అయిదవ నావిగేషన్ శాటిలైట్ కావడం విశేషం. ఇదే తరహాలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ రోదసి ప్రయోగం అన్ని దశల్లో పూర్తి అయిన తర్వాత అది అమెరికా జీపీఎస్ తరహాలో సేవలను అందిస్తుంది. ఎల్-5, ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్‌కు కావాల్సిన నావిగేషన్ సిగ్నల్స్‌ను తాజా ఉపగ్రహాం అందిస్తుంది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాం మొత్తం 1,425 కేజీల బరువు ఉంది. కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టార్లును ఉపగ్రహం మోసుకెళ్లింది. రోదసిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ పనిచేయాలంటే కేవలం నాలుగు ఉపగ్రహాలు సరిపోతాయి. కానీ ఏడు ఉపగ్రహాలను పంపడం వల్ల నావిగేషన్ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించవచ్చు. ఉపగ్రహా నావిగేషన్ వ్యవస్థ వల్ల సుమారు 1500 కిలోమీటర్ల విస్తీరణం వరకు బలమైన సిగ్నల్స్‌ను అందించవచ్చు. గతంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహాన్ని జూలై 1, 2013, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఏప్రిల్ 4, 2014, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ అక్టోబర్ 16, 2014, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ, మార్చి 28, 2015 తేదీల్లో ప్రయోగించారు. తాజా ఉపగ్రహం మోసుకెళ్లిన పేలోడ్‌లో రుబీడియం అటామిక్ క్లాక్ ఉంది.

ప్రతి ఉపగ్రహం కోసం సుమారు 150 కోట్లు ఖర్చు అవుతుంది. పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్ వర్షెన్ రాకెట్ల ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ప్రతి రాకెట్‌కు సుమారు 130 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే నావిగేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడానికి ఇస్రో సుమారు 910 కోట్లు ఖర్చు చేయనుంది. ఒకవేళ రీజినల్ నావిగేషన్ వ్యవస్థ పూర్తి అయితే ఇక భారత్ ఇతర దేశాల నావిగేషన్ సిగ్నల్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Launch India Regional Navigation Satellite System  IRNSS-1  EPSLV-C31  GPS  

Other Articles