HCU VC Appa Rao on Rohith Vemula's suicide

Hcu vc appa rao on rohith vemula s suicide

HCU, Hyderabad Central University, Rohith Suicide, Appa Rao

Hyderabad Central University(HCU) Vice Chancellor Appa Rao who is at the centre of a raging controversy over the suicide of Dalit student Rohith Vemula ruled out his resignation on the demand made by "aggrieved" students.

రోహిత్ పై సస్పెన్షన్ పై నోరువిప్పిన వి.సి

Posted: 01/20/2016 11:38 AM IST
Hcu vc appa rao on rohith vemula s suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యతో అట్టుడుకున్న హెచ్.సి.యు అంతకంతకు వేడెక్కుతోంది. అయితే యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల మీద విసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులను కనీసం ఓదార్చే బాధ్యత కూడా విసి తీసుకోకపోవడం మీద మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా విసి మీద ఫైరయ్యారు. అయితే మీడియా ముందుకు రాని విసి అప్పారావు మొదటిసారిగా మీడియాలో ఇంటర్వూ ఇచ్చాడు.

తన మీద వస్తున్న వ్యాఖ్యలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అప్పారావు స్పందించారు. తాను ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని వస్తున్న కామెంట్లను ఆయన ఖండించారు. తాను ఎవరికీ మద్దతుగా కానీ వ్యతిరేకంగా కానీ పనిచెయ్యడం లేదని అన్నారు. అసలు రోహిత్ ఆత్మహత్యకు ముందు ఆరు నెలల క్రితం యూనివర్సిటీలో యాకుబ్ మెమెన్ ఉరి మీద వివాదం మొదలైందని ఆయన వెల్లడించారు. మెమెన్ ఉరిని వ్యతిరేకిస్తూ రోహిత్ , మరికొందరు మిత్రులు వ్యవహరించిన తీరును ఏబీవీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యతిరేకించారని అన్నారు. అప్పటి నుండి రెండు వర్గాల మధ్య వివాదం సాగిందని అన్నారు.

అయితే యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల మీద యాక్షన్ తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుండి లేఖ అందిందని.. దాని మీద స్పందిస్తు క్రమశిక్షణ కమిటీని వేసినట్లు తెలిపారు. అయితే క్రమశిక్షణ కమిటి రోహిత్ సహా కొంత మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలని కమిటీ నివేదించినట్లు తెలిపారు. అయితే కమిటీ నివేదిక అందిన తర్వాత కాస్త తాత్సారం చేసిన వార్త వాస్తమే అని కానీ కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే హాస్టల్ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే తాను రాజీనామా చెయ్యాలని వస్తున్న దాని మీద మాట్లాడనని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి యూనివర్సిటికి సేవ చేస్తున్నానని అది అందరికి తెలుసు అని అన్నారు. తొందరలోనే రోహిత్ కుటుంబాన్ని కలుస్తానని కూడా ఆయన వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad Central University  Rohith Suicide  Appa Rao  

Other Articles