Union Minister Bandaru Dattatreya letter to Smruthi Irani

Union minister bandaru dattatreya letter to smruthi irani

HCU, Hyderabad Central University, HRD, Rohith Suicide, Bandaru Dattatreya

Union Minister Bandaru Dattatreya wrote a letter to HRD minister Smruthi Irani on Hyderabad Central University issue.

దత్తాత్రేయ రాసిన లేఖ ఇదే. ఏముందంటే

Posted: 01/20/2016 04:26 PM IST
Union minister bandaru dattatreya letter to smruthi irani

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య వివాదం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు చుట్టుకుంది. కేంద్ర మంత్రి లేఖ రాయడం వల్లే రోహిత్, అతడి స్నేహితులను సస్పెండ్ చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని లోక్‌సభ సభ్యుడి హోదాలో దత్తాత్రేయ లేఖ రాయడం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆ లేఖ వివరాలను ప్రస్తావిస్తూ ఐదు సార్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాయడం వల్లే విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ హోదాలో దత్తాత్రేయ రాజకీయంగా ఒత్తిడి తేవడం, వర్సిటీ నుంచి సస్పెన్షన్‌ కు పట్టుబట్టడం వల్లే రోహిత్ ఆత్మహత్యకు కారణమయ్యాయంటూ వాదిన వినిపిస్తోంది. అయితే అసలు బండారు దత్తాత్రేయ రాసిన లెటర్ లో ఏముంది అని సర్వాత్రా చర్చనీయాంశంగా మారింది. దత్తాత్రేయ రాసిన లేఖ మీకోసం..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన వినతిపత్రాన్ని జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ దత్తాత్రేయ గతేడాది ఆగస్టులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా వర్సిటీలో నిరసనలు తెలిపిన ఘటనను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మెమన్ ఉరిపై నిరసన తెలియజేయడం ఏమిటని ప్రశ్నించినందుకు సుశీల్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారని, ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరారని, దాడికి కారకులపై చర్య తీసుకోవాలని దత్తాత్రేయ ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నారంటూ హెచ్‌ఆర్‌డీ శాఖ పలుమార్లు వీసీకి లేఖలు రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad Central University  HRD  Rohith Suicide  Bandaru Dattatreya  

Other Articles