ISIS confirms death of Jihadi John

Isis confirms death of jihadi john

ISIS, Jihadi John, Terror Group ISIS, ISIS on Jihadi Johns Death

ISIS has confirmed the death of "Jihadi John" -- aka Mohammed Emwazi, aka Abu Muharib al-Muhajir -- in the latest issue of its Dabiq magazine. U.S. officials said in November that they were reasonably certain the English-speaking voice of the terror group had been killed in a targeted drone strike in Raqqa, Syria, ISIS' de facto capital.

జిహాదీ జాన్ చచ్చాడు: ISIS ప్రకటన

Posted: 01/20/2016 10:16 AM IST
Isis confirms death of jihadi john

మనుషుల తలలను నరికి ఫైశాచికాన్ని ప్రదర్శించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, మానవ మృగం జిహాదీ జాన్ మరణించినట్లు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. జిహాదీ జాన్ మరణించినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చినా కానీ అధికారికంగా ఐఎస్ఐఎస్ ప్రకటించడం ఇదే మొదటిపారి. విదేశీయుల తలలు నరుకుతున్న వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన ఉగ్రవాది జిహాది జాన్ మృతి చెందినట్లు ఐఎస్‌ఐఎస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్ మ్యాగజైన్ దబీక్‌లో జిహాది జాన్ అలియాస్ మహ్మద్ ఎమ్వాజీ 2015, నవంబర్ 12న సిరియాలోని రక్కాలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందినట్లు పేర్కొంది. వైమానిక దాడుల్లో జాన్ ప్రయాణిస్తున్న కారు ఛిద్రమైనట్లు వెల్లడించింది.

ఎమ్వాజీకి బ్రిటీష్ పౌరసత్వం ఉంది. అమెరికా జర్నలిస్టులు స్టీవెన్ సాట్‌లాఫ్, జేమ్స్‌తో పాటు అబ్దుల్ రెహ్మాన్ ఖాసింగ్, బ్రిటన్‌కు చెందిన డేవిడ్ హైన్స్, అలన్ హెన్నింగ్, జపాన్‌కు చెందిన కేంజీ గొటో బంధీల తలలు నరికింది ఎమ్వాజీనే. ఎమ్వాజీ కోసం అమెరికా సైన్యం వేట కొనసాగించింది. ఇక క్రూరంగా పాశ్చాత్య బంధీలను చంపేసిన వీడియోల్లో జిహాదీ జాన్ ఎక్కువగా కనిపించాడు. బ్రిటీష్ వ్యవహారిక భాష తీరుతో జాన్ ఆ వీడియోల్లో హెచ్చరికలు కూడా జారీ చేశాడు. జాన్‌ను మానవ మృగంగా పలువురు పోల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Jihadi John  Terror Group ISIS  ISIS on Jihadi Johns Death  

Other Articles