Jaya Sudha joins TDP

Jayasudha to quits congress joins tdp

Jayasudha, TDP, Congress, TRS, Chandrababu Naidu, Uttam Kumar Reddy, Hyderabad, TPCC, jayasudha quits congress, jayasudha to join tdp, jayasudha TRS, jayasudha TDP. jayasudha congress, secunderabad former mla, tdp, t.congress, maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha news, jayasudha updates

Former Congress MLA Jayasudha is all set to enter the Telugu Desam Party. Jaya will be meeting AP Chief Minister Chandrababu Naidi at his residence in Vijayawada foday.

తెలుగు విశేష్ చెప్పిందే నిజమైంది.. కాంగ్రెస్ కు చెయ్యి.. సైకిల్ పై రయ్య్..

Posted: 01/17/2016 02:32 PM IST
Jayasudha to quits congress joins tdp

మార్చి 27 టీడీపీ కండువా కప్పుకోనున్న జయసుధ శీర్షికతో నాడు తెలుగు విశేష్ చెప్పింది.. నేడు నిజమైంది. నాటి కథనం ఇవాళ వాస్తవ రూపం దాల్చనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యక స్థానాన్ని ఏర్పర్చుకున్న సహజనటి జయసుధ త్వరలో రాజకీయ పార్టీని మారనున్నారని.. అమె టీడీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారని నాడు తెలుగు విశేష్ కథనాన్ని ప్రచురించింది. అయితే నిజమేనా.. కేవలం మా ఎన్నికలలో మాత్రమే అమె టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ తో జతకట్టి బరిలో నిలిచారని, కానీ అమె పార్టీ మారడంపై మాత్రం అంత ఖచ్చితంగా చెప్పలేమని చెప్పిన రాజకీయ విశ్లేషకులు చెపినా.. అమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఖచ్చితంగా చెప్పింది మాత్రం తెలుగు విశేష్ ఒక్కటే. ఇప్పుడు అదే నిజమైంది. అమె సైకిల్ పై రివ్వురివ్వున షికారు కోట్టేందుకు విజయవాడుకు కూడా చేరుకున్నారు.

గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉంటున్న అమె.. త్వరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారని.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన అనంతరం ఈ మేరకు అమె నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఆమె శనివారంనాడు విజయవాడకు చేరుకున్నారు.

Also Read: టీడీపీ కండువాను కప్పుకోనున్న జయసుధ..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్భలంతో అమె రాజకీయాలోకి ప్రవేశించి.. రావడంతోనే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపోందారు. అయితే గత ఎన్నికలలో ఆఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు చేతిలో ఓటమిపాలైన అమె ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు బుజ్జగించడంతో ఆమె వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జయసుధ అప్పట్లో ప్రకటించారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జయసుధ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జయసుధ.. ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని.. ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుస్తానని చెప్పారు. తెలుగు మాట్లాడేవారందరికీ తానేంటో తెలుసునని అన్నారు. బంధుత్వ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తో తనకు అనుబంధం ఎక్కువని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశానని గుర్తు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayasudha  TDP  Congress  TRS  Chandrababu Naidu  Uttam Kumar Reddy  

Other Articles