GHMC polls: TDP and BJP agreement over seat sharing

Ghmc polls 90 divisions for tdp 60 for bjp

GHMC Elections, TDP, BJP, TDP-BJP alliance, PM Modi, Narendra Modi, AP CM Chandra babu, Chandra Babu Naidu, Tdp-Bjp seat sharing, GHMC seat sharing, GHMC Grand alliance

Finally, the TDP-BJP combine have come to a broad understanding over sharing of seats for the GHMC elections. The TDP will contest in 90 divisions, while the BJP will field candidates in 60 divisions.

టీడీపీ-బీజేపిల మధ్య ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం

Posted: 01/17/2016 02:35 PM IST
Ghmc polls 90 divisions for tdp 60 for bjp

గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలలో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీల మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. పలు దఫాలుగా జరిగిన చర్చల్లో సీట్ల సర్ధుబాటుపై పట్టువీడని పార్టీలు నామినేషన్ల పర్వానికి ఒక్క రోజు మాత్రమే మిగిలివుండటంతో.. చిట్టచివరికి గత రాత్రి పొద్దుపోయిన తర్వాత రెండు పార్టీలో ఒక అవగాహనకు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లలోనూ పోటీ చేయాలని ఈ కూటమి తీర్మానించింది. 90 డివిజన్లలో టీడీపీ పోటీ చేయనుండగా, 60 సీట్లలో బీజేపీ తన అభ్యర్థులను నిలపనుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మెజార్టీ డివిజన్ లను ఆ పార్టీ తీసుకోవాలని ప్రతిపాదించార‌ని సమాచారం‌. ఆ తర్వాత గతసారి ఎవరు గెలిచిన చోట వారు పోటీచేయాలని ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం చెప్పినప్పటికీ.. మొత్తం మీద 90-60 పార్ములాకు అంగీకరించారని తెలుస్తుంది. తమ పార్టీకి అధిక స్థానాలు కావాల‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టుప‌ట్టినా.. చివరికి 60 స్థానాల‌కు స‌ర్దుకున్నార‌ట‌.

కాగా ప్రతిష్టాత్మకమైన జూబ్లిహిల్స్ డివిజన్ కోసం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఫోన్ చేయగా, చంద్రబాబు ఆ మేరకు ఈ స్థానాన్ని వారికే కేటాయించాలని సూచించారట. మోదీ అభివృద్ధి నినాదంతో బీజేపీ ప్రచారం చేయాలని, దీంతో పాటు స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటామని భరోసా కూడా ఇవ్వాలని యోచిస్తున్నారు. అటు హైద‌రాబాద్‌లో చంద్రబాబు చేసిన‌ అభివృద్ధి ప‌నులు, సెటిల‌ర్ల ఓట్లపై న‌మ్మకంతో టీడీపీ ముమ్మర ప్రచారానికి తెరతీయనుంది.. గ్రేట‌ర్‌లో గెలిచేందుకు పార్టీలు స‌ర్వశ‌క్తులూ ఒడ్డుతున్నాయి.. కాగా వందకు పైగా సీట్లను తాము గెలుస్తామన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఈ కూటమి పార్టీలు ఎలా రాణిస్తాయో వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC Elections  TDP  BJP  Narendra Modi  Chandra Babu Naidu  

Other Articles