Indian origin Siddhartha Dhar became new Jihadi John

Indian origin siddhartha dhar became new jihadi john

new Jihadi John, Siddhartha Dhar, ISIS, Jihadi john, Syria, Islamic State, Indian Origin

Siddhartha Dhar was born to a Hindu family settled in Britain. After his father died when he was still a teenager, Dhar dropped out of school and converted to Islam under the influence of terrorist recruiter Mizanur Rahman, taking up the name Abu Rumaysah.While running a a business renting out bouncy castles in London, he went on to join the banned militant group Al-Muhajiroun, headed by Anjem Choudary.

కొత్త జిహాదీ జాన్ భారతీయ మూలాలున్న హిందువు

Posted: 01/06/2016 06:37 PM IST
Indian origin siddhartha dhar became new jihadi john

ఐసిస్ అంటే అందరికి భయం.. మనుషుల ప్రాణాలను అవలీలగా ఏ మాత్రం కనికరం లేకుండా, కిరాతకంగా తీసే ఉగ్రవాదులే గుర్తుకు వస్తారు. అయితే జిహాదీ జాన్ గురించి అన్ని దేశాలు భయపడ్డాయి. మనుషుల ప్రాణాలను తీయడం.. వారి తలలతొ ఫోటోలకు ఫోజులివ్వడం లాంటివి చేశాడు. తన బంధీలను కిరాతకంగా మతమార్చే జిహాదీ జాన్ అక్కడ జరిగిన క్షిపణి దాడిలో మరణించాడు. అయితే తాజాగా మరో కిరాతక జిహాదీ జాన్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. అతడు హిందువు, బారతీయ మూలాలున్న వాడు కావడం.

హిందువైన ఇతను  వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వెళ్లి ఇస్లాం మతం స్వీకరించాడు. ఇంగ్లాండ్‌లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్‌లో చేరాడు. అక్కడి నుంచి సిరియా వెళ్లి ఐసిస్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. తమ చేతికి చిక్కిన బంధీలను అత్యంత కర్కషంగా చంపటం ఇతని పని.ముఖానికి మాస్క్‌ వేసుకుని పీకలు తెగకోస్తున్న ధర్ వీడియోను చేసి అతని తల్లి, చెల్లెలు షాకయ్యారు.  అది తమవాడిదేనని నమ్మలేకపోతున్నారు. తన సోదరుడే అయితే అతడిని చంపేస్తానని అతని  సోదరి కోనికా ధర్ బీబీసీకి చెప్పింది.

భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్‌ పౌరుడు సిద్ధార్థ ధర్ సరి కొత్త జిహాదీ జాన్‌గా మారాడు. బ్రిటన్‌కు చెందిన సిద్దార్థ ధర్ 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరాడు. ధర్‌కు  భార్య, నలుగురు పిల్లలున్నారు. వారిని కూడా తనతోపాటు సిరియా తీసుకువెళ్లాడు. రాడికల్‌ ఇస్లాం మతగురువు అంజెమ్‌ చౌదరీ అనుచరుడిగా ఉండేవాడు. నిషేదిత ఇస్లాం మత సంస్థ ముహజిరూన్‌ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలపై  అతడిని  పోలీసులు అరెస్టు చేశారు. అయితే వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. తరువాత ఇక బ్రిటన్‌లో ఉండలేక భార్యా పిల్లలతో కలిసి సిరియా  ఉడాయించాడు. కానీ అలా వెళ్లిన వాడు ఏకంగా కిరాతకుడిగా, రాక్షసుడిగా మారతాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new Jihadi John  Siddhartha Dhar  ISIS  Jihadi john  Syria  Islamic State  Indian Origin  

Other Articles