Defeat loneliness by these tips

Defeat loneliness by these tips

loneliness, Life, loneliness, Alone, Feeling loneliness

Many of us feel very lone. If u also facing this problem then follow this tips. Dont blame any body and just change your behaviour.

"ఒంటరితనాన్ని" జయించండిలా

Posted: 01/06/2016 07:19 PM IST
Defeat loneliness by these tips

మనతో మనం గడపాలనుకోవడం, ఇలా గడిపేందుకు కొంచం సేపైనా సమయం చిక్కడం, ఒక వరం...
జీవితంలో మనతో మనం తప్ప, ఇంకెవ్వరూ ఉండక, ఉండలేకపోవడం శాపం...

అందుకే పెద్దలు కూడా, నలుగురిని కలుపుకుంటూ పొమ్మన్నారు కానీ, బంధాలను తుంచుకుంటూ, ఒంటరిగానే బతకమని ఎవ్వరూ చెప్పలేదు... ఎందుకో తెలుసా? వీరికి ఒంటరితనం ఎంతటి బాధ, ఆవేదనను మిగిలిస్తుందో తెలుసు కాబట్టి... ఒంటరితనానికీ - సూన్యానికీ చాలా దగ్గరి సంబంధం ఉంది... ఒంటరితనం మొదటి దశ అయితే, సూన్యం రెండో దశ... చివరి దశ కూడా...

ఇంతదాకా ఎందుకు? మనస్తత్వ నిపుణులు సైతం, ఆత్మహత్య చేసుకునే వారు, 30% సమస్యల పరిణామాలకు భయపడో, తలకుమించిన భారాల నుండి శాస్వతంగా తప్పించుకోవాలని అనుకునో చనిపోతూ ఉంటే, మిగితా శాతం వారు, తమకు ఎవ్వరూ లేరు అన్న "ఒంటరితనం" ఊబిలో కూరుకుపోయి, తనువూ చాలిస్తూ ఉన్నారు...

మీరే గమనించండి...
ఏ కారణం చేతైనా బాధలో ఉన్నప్పుడు, మన బాధని పంచుకునే వారు, ఓదార్చే వారు లేకపోతే, ఒకవేళ ఉన్నా, ఆ సమయంలో మన పక్కన లేకపోయినా, "ఛి ... ఎందుకీ జీవితం" అని క్షణ కాలం అయినా అనిపించకమానదు...చదువు, ఉద్యోగం, కుటుంబంతో సరిపడకపోవడం, ఇలా ఎన్నో కారణాల వల్ల, ఇష్టం ఉన్నా లేకున్నా ఒంటరిగా ఉంటున్నారు... ఈ సో కాల్డ్ ఇండిపెండెంట్ లైఫ్, తొలిరోజుల్లో ఆసక్తిగా, కొత్తగా, జీవితానికే రెక్కలు ఒచ్చినట్టు గా అనిపించినా, ఎగిరీ ఎగిరీ అలసిపోయిన రెక్కలు, ఒకరి తోడులో స్వాంతన చెందాలని అనుకోక మానవు... మీరీ దశలో కనుక వుంటే, "ఒంటరితనాన్ని" జయించడిలా;

1. ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నా, ఒక్క కామెడీ సీన్, వీలుంటే సినిమానో చూస్తే, బద్దకాన్ని వదలగొట్టే ఇన్స్టంట్ కాఫీలా, ఇన్స్టంట్ గా రిలాక్స్ అయిపోతాం మనం... మరికనేం, నెట్ లో కామెడీ సీన్ లేక సినిమానో చూసెయ్యండి. పాపకార్న్ మాత్రం మర్చిపోకండే...
2. మనకోసమే కదా మాల్స్, కాఫీ షాప్స్, ఎన్నో యెన్నెన్నో బట్టల బ్రాండ్స్? ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఒంటరిగా కూర్చోక, చేతికో బ్యాగ్ తగిలించుకుని, హాయిగా జన జీవన స్రవంతిలో తిరిగేసి రండి.
3. మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యండి... ఆగండాగండి... బాధని షేర్ చేసుకోడానికి కాదు... మీరిద్దరూ కలిసి గడిపిన ఆనంద క్షణాలని మాటలరూపంలో మళ్ళా గుర్తు చేసుకోండి. దీని తాలూకా ఆలోచన మరి కాసేపు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది.
4. మనిషై పుట్టిన ప్రతీ ఒక్కరికీ, అలాగే మనకీ చిన్నప్పుడు ఎంటర్టెయిన్ చేసిన వ్యాపకం ఏదో ఒకటి ఉంటుంది... దాన్ని తిరిగి ప్రారంభించండి.
5. ఏ వ్యాయామం అయినా, శరీరాన్నే కాదు, మనసుని కూడా ఫిట్ గా ఉంచుతుంది. ప్రయత్నించండి.
6. లైఫ్ ని లైఫ్ తో జీవించండి... ఎందుకు సీరియస్ గా తీసుకోవడం? ఒక ఎయిమ్ పెట్టుకుని కృషి చేస్తున్నారుగా... తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ ఎయిమ్ కాకపొతే ఇంకోటి. పని చెయ్యాలన్న తత్త్వం ముఖ్యం కాని, ఇది ఇలాగే ఉండాలి అన్న పంతం కాదు. ఆశ ఉండాలి, తీరకపోతే నిరాశ అనవసరం.
7. రోజుని బిజీ బిజీ గా ఉంచండి. అన్ని వెరైటీస్ ఉన్న తాలీ తినడం మనకు ఇష్టం. సో ప్రతీ రోజూ, ఈ టైం నుంచి ఈ టైం వరకూ ఈ పని అని, పని లో వెరైటీ వెతుక్కోండి. యూ విల్ ఫీల్ ఫుల్ ఆఫ్ లైఫ్.
8. మీ స్థాయికి ఎదుటివారు లేరు. ఏం చేస్తాం... కాస్త స్థాయి దిగి, అడ్జస్ట్ అవ్వండి. వొంటరితనం అయినా దూరం అవుతుంది. అయితే కొట్టుకుంటూ, లేకపోతే వారు మనకి మరీ అర్ధం అయిపోయి, జంటగా ఉంటాం కదా?
9. వయసుని మరచిపోండి... మీలో ఉన్న చిన్న పిల్లల తత్వాన్ని బయటకు తేండి... సిల్లీగా అనిపించినా సరే, ఆనందాన్ని ఇచ్చే పనులు, ఎదుటివారికి హాని కలిగించని సరదా పనులు, వయస్సుతో నిమిత్తం లేకుండా చేస్తూ ఉండండి.

చివరిగా ఒక్కమాట... మనకెదురయ్యే ప్రతీ సిచువేషన్ లో పట్టూ - విడుపూ కనబరిస్తే, వంటరితనం భయపడి పారిపోవడం ఖాయం!

 

*సునయన బాదం*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loneliness  Life  loneliness  Alone  Feeling loneliness  

Other Articles