New twist in rishiteshwari suicide case

New twist in rishiteshwari suicide case

Rishiteshwari, Rishiteshwari Suicide Case, Guntur, Nagarjuna University, Babu Rao, Principal Babu Rao

In Rishiteshwari suicide case, Principal Babu rao may arrested in next two three days. Police described Babu Raos name in FIR as A4 accused.

ITEMVIDEOS: రిషితేశ్వరి కేసులో మరో ట్విస్ట్

Posted: 01/02/2016 10:53 AM IST
New twist in rishiteshwari suicide case

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో.. ఆత్మహత్యకు పాల్పడ్డ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఘటనలో..ఆర్కిటెక్చర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ బాబురావును.. నాలుగో నిందితుడిగా చేరుస్తూ తాజా చార్జ్ షీట్ దాఖలైంది. రిషితేశ్వరి ఘటనలో.. ఇప్పటికే ప్రిన్సిపల్ బాబురావును ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. ఇప్పుడు తాజాగా అతడిని కేసులో నిందితుడిగా చేర్చడంతో.. ఇవాళో, రేపో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ విద్యార్థులు హనీషా, జయతరుణ్, సాయి శ్రీనివాస్ లు గుంటూరు జిల్లా జైలులో 45 రోజులు శిక్ష అనుభవించి.. కొద్ది రోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యారు.

Also Read: అక్కడ ర్యాగింగ్ కు ప్రిన్సిపాలే కారణం

Also Read: రిషితేశ్వరి డైరీలోని ‘మిస్టర్ X’ ఎవరు.?

కాగా రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబూరావు కీలక నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులతో పాటు ప్రజాసంఘాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీ విద్యార్థులతో కలసి ప్రిన్సిపల్ బాబూరావు డ్యాన్స్ చేసిన వీడియో బయటకు రావడం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. దాంతో ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. మరోవైపు బాబూరావును రక్షించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని.. ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. తాజా నిర్ణయంపై రిషితేశ్వరి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బాబూరావును కాపాడేందుకు అధికార పార్టీ నేతలు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ గతంలో విపక్షాలు సైతం రోడ్డెక్కాయి. ఆమె మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కూడా కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles