Pricipal indirectly encourage ragging

Pricipal baburao cause for ragging in the nagarjuna university college

Principal Babu rao, Rishiteshwari, Nagarjuna University, Guntur, Babu Rao, Chandrababu naidu

Pricipal Baburao cause for ragging in the Nagarjuna university college. Subhramanyam committe on Rishiteshwari suicide, Report that principal BabuRao behaviour is not good.

అక్కడ ర్యాగింగ్ కు ప్రిన్సిపాలే కారణం

Posted: 09/16/2015 03:55 PM IST
Pricipal baburao cause for ragging in the nagarjuna university college

ఏపిలో రిషితేశ్వరి ఆత్మహత్య మీద వివాదం సాగుతూనే ఉంది. ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు కావాలనే నాగార్జున యూనివర్సిటి కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావును వెనకేసుకొస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే రిషితేశ్వరి ఆత్మహత్య మీద వేసిన సుబ్రహ్మణ్యం కమిటి ఇచ్చిన నివేదిక చూస్తే ఆ:శ్చర్యపోవడం మనవంతవుతుంది. ఎందుకంటే కాలేజీ ప్రిన్సిపాల్ వల్లే కాలేజీలో ర్యాగింగ్ భూతం పెరిగింది అంటే నమ్మాలి మరి. రిషితేశ్వరిని వేధించిన సీనియర్లలో చాలా మందితో ప్రిన్సిపాల్ చనువుగా ఉండటంతో.. వారు మరింత రెచ్చిపోయి కాలేజీలొ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. విద్యార్థినులను వేధించిన వారిలో దాదాపుగా చాలా మంది ప్రిన్సిపాల్ తో చనువుగా ఉండటాన్ని కమిటి తప్పుపట్టింది. ప్రిన్సిపాల్ మీద న్యాయవిచారణ జరిపించాలని కమిటి సిఫారసు చేసింది.  

కాలేజీలో సీనియర్లు జూనియర్లను వేధించడం తారా స్థాయికి చేరిందని తేలింది. దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలంటూ సీనియర్లు జూనియర్లను వేధించేవారని.... జూనియర్ విద్యార్థినుల ఫోన్‌నంబర్లను సీనియర్ విద్యార్థినులు సహచర సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారని... రాత్రిపూట వారితో మాట్లాడాలంటూ జూనియర్లను వేధించేవారని కమిటీ నిర్దారించింది. రిషితేశ్వరితో సహ ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు రూములు ఖాళీ చేయాలంటూ బయటకు గెంటేసి రాత్రి వేళల్లో ఆరుబయటే నిల్చోబెట్టేవారని సుబ్రహ్మణ్య కమిటి రిపోర్ట్ చేసింది. ఫ్రెషర్స్ డేను వర్సిటీలో కాకుండా బయట హాయ్‌లాండ్‌లో నిర్వహించడం... ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం సేవించి, విద్యార్థినులతో కలసి చిందులేయడాన్ని కమిటి తప్పుపట్టింది. ప్రిన్సిపాల్ బాబూరావు ప్రవర్తనపై ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసు నమోదు చేసి విచారించాలని కమిటి సిఫారసు చేసింది.   మొత్తంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బాబూరావు అన్నింటికి కారణంగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Principal Babu rao  Rishiteshwari  Nagarjuna University  Guntur  Babu Rao  Chandrababu naidu  

Other Articles