British Asian teenage girl thrown off bus for too much makeup

British asian teenage girl thrown off bus for too much makeup

makeup, Asian teen, Zahra Sadiq, girl thrown off bus

British Asian teenage girl was thrown off a bus by a woman conductor for 'wearing too much make-up' to have a child's ticket, according to a media report.Zahra Sadiq was told by the conductor on a National Express bus in Birmingham last week that she was wearing too much makeup to be 15 years old and that her ticket was not valid because she 'didn't look like a child'.

మేకప్ ఎక్కువైంది.. బస్సులోనుండి దింపేశారు

Posted: 12/30/2015 03:56 PM IST
British asian teenage girl thrown off bus for too much makeup

అదేదో... బలం తక్కువైతే అరటిపండు తిన్నా పళ్లు విరుగుతుందన్నట్లు. పాపం ఓ అమ్మాయి అందంగా తయారు కావడం ఆమెకు శాపమైంది. అదేంటి అందంగా తయారైతే శాపంగా మారడం ఏంటీ అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది. ఇంటి నుంచి బర్మింగ్‌హామ్ సెంటర్ వెళ్లేందుకు ఓ అమ్మాయి గ్లామర్ డాల్ లాగా తయాకై.. బస్సు ఎక్కింది. 15 ఏళ్ల జహరా సిద్ధిక్ బస్సు ఎక్కగానే కండక్టర్ ఆమెను టికెట్ అడిగింది. తాను తీసుకున్న పిల్లల టికెట్‌ను ఆ అమ్మాయి కండక్టర్‌కు చూపించింది. నీ వయసు ఎంత అంటూ కండక్టర్ ఆ టీనేజర్‌ను అడిగింది. అమ్మాయి ఇచ్చిన సమాధానాన్ని ఆ కండక్టర్ నమ్మలేదు. అంతే.. జహరాను బస్సులోంచి బయటకే నెట్టేసింది. ప్రయాణికులందరూ చూస్తుండగానే కండక్టర్ ఆమెను లాగేసింది. అంతేకాదు ఆ టీనేజర్‌పై మూడు వేలు జరిమానా కూడా విధించారు. ఇక బర్మింగ్‌హామ్ సెంటర్‌కు వెళ్లేందుకు ఆ అమ్మాయి నాలుగు మైళ్లు నడవాల్సి వచ్చింది. ఈ సమస్యంతా లిప్‌స్టిక్ వల్లే అని తర్వాత తెలిసింది.

పిల్లల టికెట్‌తో ప్రయాణం చేసిన జహరాను కండక్టర్ తప్పుపట్టింది. తన వయసు 15 ఏళ్లు అంటూ టీనేజర్ ఇచ్చిన సమాధానం కండక్టర్‌కు నచ్చలేదు. జహరా లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల ఆమె వయసు 16 ఏళ్లు దాటి ఉంటుందని కండక్టర్ భావించింది. ఐడీ కార్డు కూడా లేకపోవడంతో ఆ టీనేజర్‌ను బస్సు నుంచి గెంటేశారు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే నెట్టేసినందుకు జహరా మనస్తాపానికి గురైంది. కండక్టర్ ప్రవర్తన అవమానకరంగా ఉందంటూ ఆ టీనేజర్ బంధువు ఆరోపించాడు. బస్సు ప్రయాణికురాలిని నేరస్థురాలిగా చూశారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో నేషనల్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఆ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : makeup  Asian teen  Zahra Sadiq  girl thrown off bus  

Other Articles