Atal Bihari Vajpayee's education record missing

Atal bihari vajpayee s education record missing

Dayanand Anglo-Vedic (DAV) College, Nirmala Sitharaman, gheraoed Chhatrapati Shahu Ji Maharaj University, Atal Bihari Vajpayee

The BJP members on Tuesday gheraoed Chhatrapati Shahu Ji Maharaj University (CSJMU) vice chancellor's office demanding record of ex-Prime Minister Atal Bihari Vajpayee's post-graduation from Dayanand Anglo-Vedic (DAV) College. The record was found missing after Union minister Nirmala Sitharaman approached Agra's Bhim Rao Ambedkar University (BRAU) for it in June.

వాజ్ పేయ్ సర్టిఫికేట్లు కనిపించడం లేదు

Posted: 12/30/2015 03:49 PM IST
Atal bihari vajpayee s education record missing

భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి చదువు సంబంధించి సర్టిఫికెట్లుమాయమయ్యాయి.దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అటల్ బిహారీ వాజపేయి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్-ను దయానంద్ ఆంగ్లో- వేదిక్ (డీఏవీ) కాలేజీలో పూర్తిచేశారు. బీజేపీ నేతలు కొందరు ఛత్రపలి సాహు జీ మహరాజ్ యూనివర్సిటీ (సీఎస్ జేఎమ్ యూ) ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రా భీమ్-రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ (బీఆర్ఏయూ)ను సంప్రదించగా బీజేపీ అగ్రనేత సర్టిఫికెట్లను సీఎస్ జేఎమ్ యూకు పంపించినట్లు తెలిపారు. డీఏవీ కాలేజీ, కాన్పూర్ వర్సిటీ తమ వద్ద ఆ ధ్రువపత్రాలు లేవని పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు తమ నేత వాజపేయి సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ సీఎస్ జేఎమ్ యూ ఎదుట ఆందోళనకు దిగారు.

కాగా.. కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ తమను సంప్రదించారని, కానీ వాజపేయి సర్టిఫికెట్లు వర్సిటీ వద్ద లేవని బీఆర్ఏయూ రిజిస్ట్రార్ బీకే పాండే తెలిపారు. మాజీ ప్రధాని వాజపేయి 1947లో ఆగ్రా వర్సిటీకి చెందిన దయానంద్ ఆంగ్లో-వేదిక్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారనీ, అయితే తమ యూనివర్సిటీ 1966లో నెలకొల్పారని సీఎస్ జేఎమ్ యూ వైఎస్ చాన్స్ లర్ జయంత్ వినాయక్ వైశాంపాయన్ వివరించారు. అగ్రనేత రికార్డులు సేకరించి ఇవ్వాలని బీజేపీ కాన్పూర్ అధ్యక్షుడు సురేంద్ర మైథాని ఆగ్రా వర్సిటీ అధికారులకు లేఖ రాశారు. ఈ పత్రాలు దొరకకపోతే ఛత్రపలి సాహు జీ మహరాజ్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు మైథాని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles