Protesters dhotis catches fire

Protesters dhotis catches fire

AIADMK, Jayalalitha, Vijaykanth, DMDK chief Vijayakanth, dhotis catches fire, fire in Dhotis

In a protest by AIADMK activists against DMDK chief Vijayakanth, an unpleasant incident occurred. The dhotis of the protesters caught fire when they were setting ablaze the effigy.

ITEMVIDEOS: పంచల్లో మంటలు... రోడ్ల మీద పరుగులు

Posted: 12/30/2015 04:13 PM IST
Protesters dhotis catches fire

పాపం వాళ్లంతా ఏదో ఆందోళన చేస్తూ... దిష్టిబొమ్మను దహనం చేద్దామని వచ్చారు. కానీ వాళ్లకు ఏం తెలుసు ఆ మంటల్లో తమ పంచలు కూడా మండిపోతాయని.. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాక లబోదిబోమంటూ రోడ్ల మీద పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత పార్టీకి చెందిన కార్యకర్తలు విజయ్ కాంత్ కు వ్యతిరేకంగా ఓ ఆందోళన చేపట్టారు. ఆయన మీడియా మీద చేసిన వ్యాఖ్యలను నిరసిస్తు కొంత మంది ఎఐఎడిఎంకే కార్యకర్తలు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను ఊరేగించారు. చివర్లో ఆ దిష్టిబొమ్మను కాల్చే సమయంలో జరిగిన ఓ తప్పుతో రోడ్ల మీద వాళ్లు పరుగులు తీశారు.

విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంల.. మంటలు కాస్తా.. ఆందోళనకారుల పంచలకు అంటున్నాయి. దాంతో పాపం... రోడ్ల మీద లబోదిబోమంటూ పరుగులు తీశారు. ముగ్గురు కార్యకర్తలకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. వారి పంచలు కాలిపోవడంతో పాటుగా.. వారి కాళ్లకు కూడా కాలిన గాయాలయ్యాయి. గతంలో మోదీ దిష్టిబొమ్మను కాల్చే సమయంలోనూ కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలు అయ్యాయి. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. దాంతో నిరసన తెలిపే క్రమంలో కాస్త దిష్టిబొమ్మల దహనానికి దూరంగా ఉంటే బెటరేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Jayalalitha  Vijaykanth  DMDK chief Vijayakanth  dhotis catches fire  fire in Dhotis  

Other Articles