Liquor Store For Women

Liquor store for women

Delhi, Liquor Store For Women, Women Liquior store, Wines exclusively for women

Usually any location that goes by the name ‘daaru mall’ will be off limits for women, especially in Delhi. But Star City Mall in East Delhi, right next to DLF The Galleria, is being discovered by more and more women, thanks to one liquor store that stands out from its competitors.

ITEMVIDEOS: ఆడవాళ్ల కోసం స్పెషల్ వైన్స్

Posted: 12/30/2015 01:23 PM IST
Liquor store for women

అన్నింటా మహిళలు దూసుకెళుతున్నారు. మగవారితో తాము ఎందులోనూ తీసుపోము అన్నట్లు చెలరేగిపోతున్నారు. ఆడవాళ్లను మరింత ప్రోత్సహించడానికి అన్నట్లు ప్రభుత్వాలు కూడా రకరకాల చట్టాలు చేస్తున్నాయి. ఆడవారికి అన్నింటా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వారి కోసమే స్పెషల్ బస్సులు, రైళ్లు, క్యాబులు నడిపించడం గురించి అందరం విన్నాం. కానీ దిల్లీలో మాత్రం ఆడవాళ్ల కోసం మాత్రమే ఓ మందు షాపు ఉంది. అవును అక్కడ కేవలం ఆడవాళ్లకు మాత్రమే మందు అమ్ముతారు. మందు తాగాలని అనుకున్న అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులను తట్టుకోలేకనో లేదంటే వాళ్లు తాగడాన్ని ప్రోత్సహించడానికో కానీ మహిళల కోసమే మందు దుకారణం పెట్టేశారు.

ఇండియాలో కూడా అమ్మాయిలు మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. అమెరికా తర్వాత అమ్మాయిలు ఎక్కవ సిగరెట్లు మన దేశంలోనే తాగుతున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. మరి మందు విషయంలో మాత్రం వారు వెనుకబడాలా ఏంటి..? ఇదే అవకాశంగా తీసుకొని అటువంటి మహిళల  కోసం  ప్రత్యేకంగా మద్యం షాపునే ఏర్పాటు చేసేశారు ఓ మాల్ సిబ్బంది. ఆ షాపు ఎక్కడో కాదండీ?  సాక్ష్యాత్తూ భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలోని స్టార్ సిటీ మాల్లో. కాగా ఇక్కడ షాపు సెక్యూరిటీ గార్డ్ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల వరకు అందరూ మహిళలే అని, మద్యం షాపుకు వెళ్లాలనుకునే మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా రావచ్చని మాల్ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి వారికి కూడా స్పెషల్ మందు దుకాణాలు వచ్చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Liquor Store For Women  Women Liquior store  Wines exclusively for women  

Other Articles