Voting on the way for Legislative Council Seats In Telangana

Close contest likely in council elections

voting, begins, for, legislative, council, seats, in, telangana, local bodies MLC elections , mlc elections , telangana ,india

Polling is on the way for six seats of local bodies constituencies in state Legislative Council today in Telangana.

స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Posted: 12/27/2015 11:36 AM IST
Close contest likely in council elections

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కోనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికలలో ఆయా జిల్లాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలుగు జిల్లాలలో మొత్తం 2,199 మంది స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలుగు జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు అదేవిధంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు, మహబూబ్‌నగర్‌లోని రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు, నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లన్నింటిని పూర్తిచేశామని చెబుతున్న ఎన్నికల అధికారులు ఈ నెల 30న ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు.

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కాంగ్రెస్ నేత డీకే అరుణ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వాస్తవానికి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బలమే అధికమని తెలిసి కూడా టీఆర్ఎస్ బరిలోకి దిగి తమ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ వాదనకు దిగారు. ఆపై టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టి పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపారు. మరోపక్క, దాదాపు 200 మంది అనుచరులతో నల్గొండ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్గొండలోనూ ఉద్రిక్తత నెలకొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : local bodies MLC elections  mlc elections  telangana  

Other Articles