Chandrababu Participates in KCR's Ayuta Chandi Yaagam

Chandrababu performed pooja at ayuta chandi yagam

Chandrababu, KCR, Ayuta Chandi Yaagam, chandi yagam maha poornahuti, president pranab mukharjee, Fire breaks out, Erravelli yagashaala, Controlled in Minutes, KCR, Ayuta Chandi Yaagam, governer narasimhan, chandi yagam maha poornahuti

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Sunday participated in the Ayuta Chandi Yaagam being performed by Telangana Chief Minister K. Chandrashekar Rao at Erravelli near the city.

ఆయుత చండీయాగంలో పాల్గొన్న ‘ఇద్దరు చంద్రులు’

Posted: 12/27/2015 12:18 PM IST
Chandrababu performed pooja at ayuta chandi yagam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గోన్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో ఆయుత చండీ యాగం చివర రోజున ఆయన పాల్గొంటున్నారు.  ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో పండితులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కోప్పుల ఈశ్వర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు మంత్రులు సుజనాచౌదరి, కేఈ కృష్ణ మూర్తి, గంటా శ్రీనివాస్లు ఎర్రవల్లికి చేరుకున్నారు.

కాగా యాగశాల వద్దకు విచ్చేసిన చంద్రబాబును కేసీఆర్ సాధరంగా యాగశాలలోకి ఆహ్వానించారు. అంతకుముందు వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన వెంట తెచ్చిన బెజవాడ ఇంద్రకీలాధ్రి కనకదుర్గమ్మ పట్టుచీర, కుంకుమ, ప్రసాదాలను చంద్రబాబు కేసీఆర్ కు అందించారు. నేటి యాగపు సంప్రదాయ పసుపు రంగు వస్త్రం కప్పుకుని నడుచుకుంటూ ప్రధాన యాగస్థలికి వరకు చేరుకున్నారు. చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్, ఆపై వేదిక వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శనం చేయించి, విశిష్ట అతిథుల వేదికపై చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా యాగం జరుగుతున్న తీరును చంద్రబాబుకు కేసీఆర్ వివరించారు.కనకదుర్గమ్మ కానుకలను ఒక్కొక్కటిగా, మంత్రి గంటా శ్రీనివాస్, చంద్రబాబుకు అందిస్తుంటే, వాటిని చంద్రబాబునాయుడు స్వయంగా కేసీఆర్ కు అందించారు. ఆపై కేసీఆర్ వాటిని మహాచండికి నైవేద్యంగా అందించారు. మూడు డజన్లకు పైగా అరటిపండ్లు, పట్టు చీర, పసుపు, కుంకుమ ఇతర పూజా ద్రవ్యాలను హోమగుండంలో వదిలారు. ఆపై ఇద్దరు నేతలూ హోమగుండంలో ఆవు నెయ్యిని పోస్తూ, కానుకలన్నీ అమ్మవారికి చేరేలా అగ్నిదేవుని సాయం కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  kcr  erravalli  ayutha chandi yagam  

Other Articles